PM Modi : అర్జెంటీనా పర్యటనకు ప్రధాని మోడీ..57 ఏళ్ల తర్వాత చారిత్రక పర్యటన

ఈ సందర్బంగా హోటల్ పరిసర ప్రాంతాలు ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా సంప్రదాయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రవాస భారతీయులు మోడీకి ఉత్సాహంగా స్వాగతం పలికారు.

Published By: HashtagU Telugu Desk
PM Modi to visit Argentina...historic visit after 57 years

PM Modi to visit Argentina...historic visit after 57 years

PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీ తన చారిత్రక అర్జెంటీనా పర్యటనలో భాగంగా బ్యూనస్ ఎయిర్స్ చేరుకున్న వేళ, అక్కడి ప్రవాస భారతీయుల నుండి ఆయనకు అభినందనల జల్లు కురిసింది. అల్వియర్ ప్యాలెస్ హోటల్‌కు చేరుకున్న ప్రధాని మోడీకి ‘మోడీ-మోడీ’, ‘జై హింద్’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో స్వాగతం పలుకుతూ భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్బంగా హోటల్ పరిసర ప్రాంతాలు ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా సంప్రదాయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రవాస భారతీయులు మోడీకి ఉత్సాహంగా స్వాగతం పలికారు.

Read Also: BJP : నేడు తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రామచందర్

ప్రధాని మోడీ కూడా అక్కడి వారితో హర్షభరితంగా మెలగడం, పలుకుబడి చూపించడం చూసి ప్రవాస భారతీయులు గర్వంగా అనిపించుకున్నారు. చాలా మంది మోడీ నుంచి ఆటోగ్రాఫ్‌లు తీసుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోడీ అర్జెంటీనా చేరుకున్న వెంటనే ఎజీజా అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్కడి అధికారుల నుండి అధికారిక లాంఛనాల నడుమ స్వాగతం అందుకున్నారు. ఇది దాదాపు 57 సంవత్సరాల విరామం తర్వాత భారత ప్రధానమంత్రి చేపట్టిన తొలి ద్వైపాక్షిక పర్యటన కావడం విశేషం. ఈ పర్యటనకు ప్రాధాన్యతను తెలియజేస్తూ, మోడీ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఒక సందేశాన్ని పంచుకున్నారు. అందులో ఆయన అర్జెంటీనాతో సంబంధాలను మరింత బలోపేతం చేయడం మా లక్ష్యం. అధ్యక్షుడు జేవియర్ మిలీతో ముఖాముఖి చర్చలకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని పేర్కొన్నారు.

ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా, ప్రధాని మోడీ మొదటగా అర్జెంటీనా దేశపు స్వాతంత్ర్య పోరాట యోధుడు జనరల్ జోస్ డి శాన్ మార్టిన్ విగ్రహానికి పుష్పాంజలి అర్పించనున్నారు. అనంతరం అధ్యక్షుడు మిలీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపి, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దృఢపరచే దిశగా అడుగులు వేయనున్నారు. ఇప్పటికే భారత్-అర్జెంటీనా సంబంధాలు 2019లో వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరాయి. వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ వంటి అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతోంది. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

Read Also: DalaiLama: దలైలామా వారసుడిని ఎంపిక చేసే విషయంలో ఉద్రిక్తత, ఎలా ఎంపిక చేస్తారు?

  Last Updated: 05 Jul 2025, 11:21 AM IST