Site icon HashtagU Telugu

Bose Statue Row : బోస్ విగ్రహ ఆవిష్క’రణం’

Netaji Statue

Netaji Statue

విగ్రహాల ఆవిష్కరణ కూడా రాజకీయ అనుకూల అంశంగా బీజేపీ, కాంగ్రెస్ నడుమ మారిపోయింది. జనవరి 23న నేతాజీ 125వ జయంతి సందర్భంగా నేతాజీ సుబాస్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తారు. ఆ విషయాన్ని చెబుతూ మోడీ , షా ధ్వయం కాంగ్రెస్ మీద ఆరోపణలు చేశారు. బోస్ ను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందని విమర్శించారు. ప్రతిగా హిందూమహాసభ రూపంలో సావర్కర్ ఏమి చేసాడో చెప్పాలి అని నిలదీస్తుంది. నేతాజీ నడిపిన ఐ ఏన్ ఏ సైన్యాన్ని చంపింది ఎవరూ చెప్పాలని షా , మోడీ ధ్వయాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.భారతదేశ త్యాగ భావానికి చిహ్నంగా ఇండియా గేట్ వద్ద స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. బోస్ యొక్క విగ్రహం పూర్తయ్యే వరకు, అతని హోలోగ్రామ్ విగ్రహం అదే స్థలంలో ఉంటుంది. నేతాజీ జయంతి అయిన జనవరి 23న హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని మోడీ చెప్పాడు.

అమర్ జవాన్ జ్యోతి శుక్రవారం జాతీయ యుద్ధ స్మారక జ్యోతి యొక్క శాశ్వతమైన జ్వాలతో విలీనం చేయబడుతుంది. దీనికి అనుసంధానంగా నేతాజీ విగ్రహం 28 అడుగులు * 6 అడుగులు కొలతలతో నిర్మాణం అవుతుంది.ఈ సందర్భంగా సావర్కర్ నేతృత్వంలోని హిందూ మహాసభ నేతాజీకి చేసిన చారిత్రక ద్రోహాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా గుర్తు చేసాడు. “బ్రిటీష్ పాలన నుండి ఈశాన్య ప్రాంతాలను విముక్తి చేయడానికి నేతాజీ INAని నిర్వహిస్తున్నప్పుడు, సావర్కర్ బ్రిటిష్ సైన్యంలో హిందూ మహాసభను నియమించమని ఉద్బోధించారు. అదే సైన్యం INA సైనికులను పెద్ద ఎత్తున హతమార్చిందని పవన్ ఖేర్ చెబుతున్నాడు. ప్రధానమంత్రి తన సైద్ధాంతిక పూర్వీకుల అవమానకరమైన చరిత్రను చదివి దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని చేర్చడానికి ఈ సంవత్సరం నుండి గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 24కి బదులుగా జనవరి 23న ప్రారంభమవుతాయని గత వారం ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
జనవరి 23ని పరాక్రమ్ దివస్ లేదా శౌర్య దినోత్సవంగా జరుపుకోవాలని గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఏడాది నేతాజీ 125వ జయంతి సందర్భంగా 23న గణతంత్రాన్ని జరపాలని సిద్దం అవుతుంది.

Exit mobile version