Site icon HashtagU Telugu

Yoga Day : యోగాస‌నాలు వేసిన ప్ర‌ధాని మోడీ

Modi Yoga

Modi Yoga

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని న‌రేంద్ర‌ మోదీ పాల్గొన్నారు. ఆయ‌న కూడా అంద‌రితో క‌లిసి యోగాస‌నాలు వేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే మనం ఉత్సాహంగా ఉంటామని ఆయ‌న పేర్కొన్నారు. యోగా దినోత్సవం ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచన అని ఆయన తెలిపారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని.. ఇది అందరిదని తెలిపారు. యోగా సాధన చేస్తే ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతాయని… భారతదేశ ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుందని తెలిపారు. యోగా సాధన మనసును ప్రశాంతంగా ఉంచుతుందని.. కోట్లాది మంది ప్రజల మనసు ప్రశాంతంగా ఉంటే ప్రపంచ శాంతి నెలకొంటుందన్నారు. అందుకే యోగా ప్రజలను, దేశాలను కలుపుతోందని అన్నారు. ఈ యోగా కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.