5G: ఇవాళ 5జీ సేవలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ…!!

మనదేశంలో ఇవాళ్టి నుంచి 5G సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ...ఢిల్లీలోని ప్రగతిమైదానంలో జరిగే 6వ విడత ఇండియా మొబైల్ కార్యక్రమంలో ఈ 5జీ సేవలను ప్రారంభించనున్నారు.

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 07:44 AM IST

మనదేశంలో ఇవాళ్టి నుంచి 5G సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ…ఢిల్లీలోని ప్రగతిమైదానంలో జరిగే 6వ విడత ఇండియా మొబైల్ కార్యక్రమంలో ఈ 5జీ సేవలను ప్రారంభించనున్నారు. కొన్ని నగరాల్లో మాత్రమే ఈ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే 2ఏళ్లలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరించున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

2035నాటికి భారత్ ను 450 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో 5జీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 5జీతపాటు కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలను పెంపోదిస్తుందని తెలిపాయి. నూతన అవిష్కరణలు, అంకుర సంస్థలు, డిజిటల్ మీడియా విజన్ను చేరుకోవడానికి ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపాయి. చైనా తర్వాత స్మార్ట్ ఫోన్ లకు అతిపెద్ద మార్కెటుగా భారత్ ఉండటంతో ఇప్పుడు 5జీ రాకతో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.

కాగా చిన్నవ్యాపారులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంటర్ నెట్ స్పీడ్ జీయో రాకతో 10రెట్లు పెరగనుంది. దీంతో తక్కువ కెపాసిటితో ఉన్న డివైజులతో ఎక్కువ సేవలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు మెరిగైన కాల్స్, కనెక్టివిటీ సదుపాయాన్ని కూడా పొందుతారు. నిమిషంలో సినిమాలు, ఇతర విషయాలను డౌన్ లోడ్ చేసుకోగలుగుతారు. టీవీ , మల్టీమీడియా మొదలైనవి హై క్వాలిటీలో పాటు స్పీడ్ గా చూడవచ్చు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం రవాణ, ట్రాఫిక్ వంటి అన్ని రంగాల్లో విప్లవం వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.