Arka Arunika : వాతావరణ సూచనలను కచ్చితత్వంతో పొందే విభాగంలో భారత్ మరింత పురోగతి సాధించింది. ఇందుకోసం మన దేశానికి రెండు కొత్త సూపర్ కంప్యూటర్లు ఈరోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. అర్కా, అరుణిక అనే సూపర్ కంప్యూటర్లను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ సూపర్ కంప్యూటర్లు(Arka Arunika) పాతవే. అయితే వాటి కెపాసిటీని మన దేశం మూడు రెట్లు పెంచింది. అర్కా, అరుణిక సూపర్ కంప్యూటర్లలో ఒకదాన్ని పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ (ఐఐటీఎం)లో, మరోదాన్ని నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (ఎన్‌సీఎంఆర్‌డబ్ల్యూఎఫ్)లో వినియోగిస్తున్నారు. గతంలో ఈ రెండు సూపర్ కంప్యూటర్ల సామర్థ్యం 6.8 పెటాఫ్లాప్స్ ఉండేది. కేంద్ర ప్రభుత్వం రూ.850 కోట్లు వెచ్చించి ఈ రెండింటి సామర్థ్యాన్ని 22 పెటాఫ్లాప్స్‌కు పెంచింది. దీనివల్ల ఈ సూపర్ కంప్యూటర్లు వాతావరణ సూచనలను మరింత కచ్చితత్వంతో ఇవ్వగలుగుతాయి. మనదేశంలో ఎక్కడ ఎంత వాన పడుతుందో కొన్ని గంటల ముందే పక్కాగా చెప్పగలుగుతాయి.
Also Read :PM Kisan 18th Installment: రైతులకు శుభవార్త.. అక్టోబర్ 5న పీఎం కిసాన్ నగదు జమ..!
ఇప్పటివరకు ఈ సూపర్ కంప్యూటర్లు 12 కి.మీ. గ్రిడ్ పరిమాణంలో శాటిలైట్లు పంపే ఫొటోలను విశ్లేషించి.. వాటి ఆధారంగా వాతావరణ సూచనలు జారీ చేసేవి. ఈ వాతావరణ రిపోర్టులలో కచ్చితత్వం లోపించేది. వాతావరణ పరిస్థితులు చాలాసార్లు అకస్మాత్తుగా మారిపోయేవి. గ్రిడ్ సైజ్‌ను 6 కి.మీ మేర తగ్గిస్తే కుండపోత వర్షాలు కురిసే అవకాశమున్న ఏరియాలను చాలా స్పెసిఫిక్‌గా గుర్తించే వీలుంటుంది. అందుకే అర్కా, అరుణిక సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. వాటి కెపాసిటీని 22 పెటాఫ్లాప్స్‌కు పెంచినందు వల్ల ఇక గ్రిడ్ సైజును 6 కి.మీ మేర తగ్గించేందుకు వీలు కలగనుంది.
Also Read :Amrit Kalash Fixed Deposit: ఎస్బీఐలో అద్భుతమైన స్కీమ్.. కేవలం నాలుగు రోజులు మాత్రమే ఛాన్స్..!
అర్కా, అరుణిక సూపర్ కంప్యూటర్లతో కూడిన హై పర్ఫామెన్స్ కంప్యూటింగ్(హెచ్‌పీసీ) వ్యవస్థను ఇవాళ ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. అయితే దీని సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో రెండు నెలల టైం పడుతుంది. ఇవి ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీలను వినియోగించి వాతావరణ మోడల్స్‌ను విశ్లేషించగలవు. వాతావరణ మార్పులపై కచ్చితత్వంతో సూచనలను జారీ చేయగలవు.