Site icon HashtagU Telugu

New Vande Bharat Express : మ‌రో వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ

Pm Modi Imresizer

Pm Modi Imresizer

ఉనా హిమాచల్ రైల్వే స్టేషన్ నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంబ్ అందౌరా నుండి న్యూఢిల్లీ వరకు నడుస్తోంది. ఇది దేశంలో ప్రవేశపెట్టిన నాల్గవ వందే భారత్ రైలు. గ‌త మూడు వందే భార‌త్ రైళ్ల‌తో పోల్చితే ఇది అధునాత‌న‌మైంది. తక్కువ వ్యవధిలో అధిక వేగాన్ని చేరుకోగలదు. వందే భారత్ ప్రారంభోత్సవం గురించి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ కృషి వల్ల హిమాచల్ ప్రదేశ్‌లో రైల్వే విస్తరణ జరిగిందని, గురువారం ఉనా నుండి ఢిల్లీకి వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తామన్నారు. ఉనా జిల్లాలోని హరోలిలో 1900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బల్క్ డ్రగ్ పార్క్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు ప్రధాని మోదీ రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. 48 మెగావాట్ల చంజు-III హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మరియు 30 మెగావాట్ల డియోతల్ చంజు హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఈ రెండు ప్రాజెక్టులు ఏటా 270 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి

Exit mobile version