PM Modi: పాత నోట్లను రద్దు చేసి మూల్యం చెల్లించుకున్న దేశాలు ఇవే..?

ప్రధాని మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - January 2, 2023 / 10:51 PM IST

PM Modi: ప్రధాని మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాత్రికి రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుున్నారు. భారతదేశ చరిత్రలో గతంలో కూడా నోట్ల రద్దు చేయగా.. మోదీ కూడా పెద్ద నోట్లను రద్దు చేస్తూ కొత్త నోట్లను తీసుకురావడం సాహోసపేత నిర్ణయంగా చెప్పవచ్చు. పెద్ద నోట్ల రద్దు ద్వారా అవినీతి బయటకు వస్తుందని మోదీ చెప్పగా.. బ్లాక్ మనీ బయటపడిన దాఖరాలు కనిపించలేదు.

అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్ధిక వ్యవస్థకు పెద్దగా నష్టం జరగలేదు. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు నోట్ల రద్దును అమలు చేసి తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని మూటకట్టుకున్నాయి. నైజీరియా, ఘనా, పాకిస్తాన్. జింబాబ్వే, ఉత్తర కోరియా, సోవియట్ యూనియన్, ఆస్ట్రేలియా, మయన్మార్, కాంగో దేశాలు గతంలో నోట్ల రద్దును అమలు చేసి ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. 1984లో నైజీరియా పాత నోట్లను రద్దు చేయగా.. అప్పుడు ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది.

ఇక ఘనా ప్రభుత్వం 1982లో నోట్ల రద్దును అమలు చేసింది. దీని వల్ల ప్రజలు బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించడం, స్థిరచరాస్తులు కూడబెట్టుకోవడంతో ఆర్ధిక వ్యవస్ధ బలహీనపడిపోయింది. ఇక పాకిస్తాన్ కూడా 2016లో పాత నోట్లను రద్దు చేస కొత్త డిజైన్ నోట్లను ప్రవేశపెట్టింది. దీని వల్ల పాక్ ఆర్ధిక వ్యవస్థకు కూడా కాస్త నష్టం జరిగింది. ఇక జింబాబ్వే 2008లో 100 ట్రిలియన్ డాలర్ నోటును ప్రవేశపెట్టగా.. అది సత్పలితాలు ఇవ్వలేదు. ఆ నోటు విలువ 0.5 డాలర్ కి పడిపోవడంతో కొందరు ఆన్ లైన్ లో అమ్మకానికి కూడా పెట్టారు.భారత్ లో కాదు గతంలో అనేక దేశాలు పాత నోట్లను రద్దు చేసి మూల్యాన్ని మూటకట్టుకున్నాయి.