Site icon HashtagU Telugu

PM Modi: ఇండియా కూట‌మి వారి కుటుంబాల కోసం ప‌నిచేస్తుంది.. పేద‌ల సంక్షేమం వారికి ప‌ట్ట‌దుః ప్ర‌ధాని

Pm Modi Takes On India Alliance, Says ‘they Work For ‘parivar’ Not Poor’

Pm Modi Takes On India Alliance, Says ‘they Work For ‘parivar’ Not Poor’

 

PM Modi : యూపీలోని వార‌ణాసి(Varanasi)లో శుక్ర‌వారం సంత్ ర‌విదాస్ జ‌యంతోత్స‌వాల(Sant Ravidas Jayanti) సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ(pm modi) ప్ర‌సంగించారు. సంత్ ర‌విదాస్ జీ ఆలోచ‌న‌ల‌ను త‌మ ప్ర‌భుత్వం ముందుకు తీసుకువెళుతోంద‌ని వివ‌రించారు. ఈ సందర్భంగా మోడీ విప‌క్ష ఇండియా కూట‌మిపై విరుచుకుప‌డ్డారు. ఇండియా కూట‌మి వారి కుటుంబాల కోసం ప‌నిచేస్తుంద‌ని పేద‌ల సంక్షేమం వారికి ప‌ట్ట‌ద‌ని ఆరోపించారు. విప‌క్ష కూట‌మి కులం పేరుతో క‌ల‌హాల‌కు దిగుతూ ద‌ళితులు, అణ‌గారిన‌వ‌ర్గాల సంక్షేమానికి ఉద్దేశించిన ప‌ధ‌కాల‌ను వ్య‌తిరేకిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. పేద‌ల సంక్షేమం పేరుతో విప‌క్ష నేత‌లు త‌మ కుటుంబాల కోసం రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ప్ర‌ధాని మండిప‌డ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

బీజేపీ ప్ర‌భుత్వం(bjp govt) అంద‌రి కోసం ప‌నిచేస్తుంద‌ని, ఈ ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు అంద‌రికీ వ‌ర్తిస్తాయ‌ని చెప్పారు. స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రి అభ్యున్న‌తి కోసం త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. స‌మాజంలో అణ‌గారిన వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ద‌క్కిన‌ప్పుడే స‌మాన‌త్వం సిద్ధిస్తుంద‌ని అన్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్న వ‌ర్గాల‌ను కలుపుకుపోయేలా గ‌త ప‌దేండ్లుగా క‌స‌ర‌త్తు సాగుతోంద‌ని చెప్పారు. గ‌తంలో పేద‌ల‌ను చివ‌రి వ్య‌క్తులుగా చూసే ప‌రిస్ధితి ఉండేద‌ని, త‌మ హ‌యాంలో వారికోసం భారీ ప‌ధ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేశామ‌ని ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు.

read also : CM Revanth Visit Medaram : మేడారం వనదేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్