PM Modi slams Sam Pitroda: దుమారం రేపుతున్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన మోడీ

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శామ్ పిట్రోడా తన అభ్యంతరకర వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. వారసత్వ పన్నుకు సంబంధించి మాట్లాడిన శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ శామ్ పిట్రోడా వ్యాఖ్యలను తప్పు పడుతూ మండిపడ్డారు.

PM Modi slams Sam Pitroda: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శామ్ పిట్రోడా తన అభ్యంతరకర వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. వారసత్వ పన్నుకు సంబంధించి మాట్లాడిన శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ శామ్ పిట్రోడా వ్యాఖ్యలను తప్పు పడుతూ మండిపడ్డారు.

ఈశాన్య ప్రాంతంలో నివసించే వారు చైనాలా కనిపిస్తారని, దక్షిణాదిలో నివసించే వారు ఆఫ్రికన్‌లుగా కనిపిస్తారని శామ్ పిట్రోడా అన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారతదేశం వంటి విభిన్న దేశంలో అందరూ కలిసి జీవిస్తారని చెప్పాడు. అయితే తూర్పు భారతదేశంలోని ప్రజలు చైనా ప్రజలలాగా, పశ్చిమ భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళు అరబ్బులలాగా మరియు దక్షిణాన నివసిస్తున్న ఆఫ్రికన్ ప్రజలలా కనిపిస్తారని ఆయన చెప్పారు. ఇంత చెప్పినా కూడా చివరిలో అందరం కలిసి జీవిస్తున్నామని చెప్పడం ఆసక్తికదాయకం.

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శామ్ పిట్రోడా చేసిన ఈ కామెంట్స్ పై బీజేపీ తరపున అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బదులిచ్చారు. మన దేశం గురించి కొంచెం అర్థం చేసుకోండని సూచించారు. నేను నార్త్ ఈస్ట్ అయినప్పటికీ నేను భారతదేశం పౌరుడిగానే కనిపిస్తానని బదులిచ్చాడు.తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణలోని వరంగల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాజుగారి మామ అమెరికాలో ఉంటున్నారని ఈ రోజు తెలుసుకున్నాను. ఆయన తనకు తాత్విక మార్గదర్శి. క్రికెట్‌లో థర్డ్ అంపైర్ ఉన్నట్లే ఈ యువరాజు థర్డ్ అంపైర్ నుండి సలహా తీసుకుంటాడని ఎద్దేవా చేశారు మోడీ. చర్మం రంగు నల్లగా ఉన్నవారంతా ఆఫ్రికన్లే అని యువరాజు మామ చెప్పాడు. అంటే నా దేశంలోని చాలా మంది వ్యక్తులు వారి చర్మం రంగు ఆధారంగా దుర్వినియోగానికి గురయ్యారు. చర్మం రంగును చూసి, అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము కూడా ఆఫ్రికన్ అని, అందుకే ఆమె చర్మం నల్లగా ఉంటే ఆమెను ఓడించాలని భావించారని మోడీ అన్నారు. నన్ను ఎవరైనా తిడితే కోపం రాదు, కానీ నా దేశంలో చర్మం రంగు ఆధారంగా ప్రజలు వివక్షకు గురవుతారు అని మోడీ విచారం వ్యక్తం చేశారు.

We’re now on WhatsAppClick to Join.

సామ్ పిట్రోడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సర్వే నిర్వహించి ఎవరికి ఎంత ఆస్తి ఉందో తేలుస్తామని కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ఈ ప్రకటనపై శామ్ పిట్రోడాను ప్రశ్నించగా అమెరికాలో విధించిన వారసత్వ పన్ను గురించి ప్రస్తావించారు.అమెరికాలో వారసత్వపు పన్ను ఉందన్నారు. ఒక వ్యక్తికి 100 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉంటే. అతని మరణం తరువాత ఆస్తిలో 45 శాతం అతని పిల్లలకు బదిలీ చేయబడుతుంది, అయితే ఆస్తిలో 55 శాతం ప్రభుత్వ యాజమాన్యం అవుతుందన్నారు. కానీ భారతదేశంలో అలాంటి చట్టం లేదని ఆయన అన్నారు. ఇక్కడ ఎవరికైనా రూ.10 వేలకోట్ల ఆస్తులుంటే అతని మరణానంతరం అతని పిల్లలకు అతని ఆస్తి అంతా వస్తుందని చెప్పారు.

Also Read: PM Modi slams Sam Pitroda: దుమారం రేపుతున్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన మోడీ