Site icon HashtagU Telugu

Modi Selfie: యువ రైతు కోరిక మేరకు సెల్ఫీ ఇచ్చిన మోడీ

Modi Selfie

Modi Selfie

Modi Selfie: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శ్రీనగర్‌లో పర్యటించారు. బక్షి స్టేడియంలో రూ.6400 కోట్లతో 53 అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని కాశ్మీర్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాశ్మీర్ అభివృద్ధిపై చర్చించారు.

పుల్వామాకు చెందిన తేనెటీగల పెంపకందారుడు నజీమ్ అనే యువ రైతుతో ప్రధాని మోదీ సంభాషించారు. కశ్మీర్ తేనె కిలో రూ. 1000కి చేరుకుందని ప్రధాని మోదీకి తెలిపిన నజీమ్..ప్రధానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. అతని విజ్ఞప్తి చూసి కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రజలు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మోడీని ఆ యువరైతు సెల్ఫీని అభ్యర్దించాడు. దీంతో మోడీ SPG ప్రత్యేక బలగాల వైపు చూసి నేను మీకు సెల్ఫీ తప్పకుండ ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత ప్రధాని మోదీ తనతో సెల్ఫీ దిగారు. ఈ సంఘటనను ప్రస్తావిస్తూ మోడీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక పోస్ట్‌లో ఇలా వ్రాశారు. నా స్నేహితుడు నజీమ్‌తో ఒక మరపురాని సెల్ఫీ. అతని మంచి పనికి నేను ఆకట్టుకున్నాను. అతను బహిరంగ సభలో సెల్ఫీ కోసం అభ్యర్థించాడు మరియు అతనిని కలవడం సంతోషంగా ఉందని చెప్పాడు మోడీ.

కార్యక్రమంలో కాశ్మీరీ యువతను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇక్కడి సరస్సుల్లో కమలం వికసిస్తుందని, బీజేపీ చిహ్నం కూడా కమలమేనని, జమ్మూ కాశ్మీర్‌తో బీజేపీకి ఉన్న సంబంధం అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు వల్ల సామాన్య కాశ్మీరీలను కొన్ని రాజకీయ కుటుంబాలు తమ స్వలాభం కోసం తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. నేడు ఆర్టికల్ 370 లేదు, అందుకే నేడు జమ్మూ కాశ్మీర్ యువత మనోభావాలు గౌరవించబడుతున్నాయఐ చెప్పారు మోడీ.

Also Read: Gobi Pakora: ఎంతో క్రిస్పీగా ఉండే గోబీ పకోడీ టేస్టీగా తయారు చేసుకోండిలా!

Exit mobile version