Loksabha Elections : రానున్న ఎన్నిక‌లు దేశ భవిష్య‌త్‌ను నిర్ధారించే ఎన్నిక‌లు : ప్ర‌ధాని మోడీ

  • Written By:
  • Updated On - April 15, 2024 / 02:56 PM IST

Loksabha Elections 2024 : కేర‌ళ‌(Kerala)లోపి ప‌ల‌క్కాడ్‌(Palakkad)లో సోమ‌వారం జ‌రిగిన ర్యాలీని ఉద్దేశించి ప్ర‌ధాని మోడీ(PM Modi) మాట్లాడుతూ.. మీ భ‌విష్య‌త్‌ను, మీ చిన్నారుల మెరుగైన భ‌విష్యత్‌కు ఈ ఎన్నిక‌లు గ్యారంటీ ఇస్తాయ‌ని చెప్పారు. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌లు(Loksabha Elections) దేశ భవిష్య‌త్‌(future of the country)ను నిర్ధారించే ఎన్నిక‌ల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు.

గ‌త ప‌దేండ్లుగా ఎన్డీయే ప్ర‌భుత్వం ప్ర‌పంచంలో భార‌త్ విశ్వ‌స‌నీయ‌త‌ను ఎలా పెంచిందో మీరు చూశార‌ని అన్నారు. భార‌త్‌ను బ‌ల‌హీన దేశమ‌నే భావ‌న‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు క‌ల్పించాయ‌ని చెప్పారు. భార‌త్‌పై ఈ ముద్ర‌ను బీజేపీ ప్ర‌భుత్వం తొల‌గించి దేశాన్ని బ‌ల‌మైన దేశంగా తయారుచేసింద‌ని తెలిపారు. ఈరోజు భార‌తీయులెవ‌రైనా విదేశాల‌కు వెళితే వారిని గౌర‌విస్తున్నార‌ని గుర్తుచేశారు.

We’re now on WhatsApp. Click to Join.

యుద్ధంలో చిక్కుకున్న త‌మ పౌరుల‌ను కాపాడుకునే స‌త్తాను ఈరోజు భార‌త్ సంత‌రించుకున్న‌ద‌ని అన్నారు. కోవిడ్ మహ‌మ్మారి పంజా విసిరితే భార‌త్ వ్యాక్సిన్ల‌ను త‌యారుచేసి పౌరుల‌కు అందించ‌డ‌మే కాకుండా ఇత‌ర దేశాల‌కూ సాయం చేసింద‌ని మోడీ గుర్తుచేశారు.

గత పదేళ్లలో జరిగింది, మీరు చూసింది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, దేశానికి చేయాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం భారత్‌ను బలహీన దేశంగా మార్చితే, బీజేపీ బలమైన దేశంగా మార్చిందని తెలిపారు. గత పదేళ్లలో భారత విశ్వసనీయతను తమ ప్రభుత్వం ఎలా పెంచిందో అందరూ చూశారని వ్యాఖ్యానించారు.

Read Also: Summer Special Trains : 15 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ వస్తున్నాయ్.. వివరాలివీ

“నేడు దేశంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తున్నాం. పశ్చిమ భారత దేశంలోని అహ్మదాబాద్, ముంబయి మధ్య బుల్లెట్‌ రైలు పనులు జరుగుతున్నాయని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించాం. రానున్న రోజుల్లో అది పూర్తయిన వెంటనే దేశంలో మొట్టమొదటి బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులు పెడుతుంది. దాని అనుభవాన్ని చూసి, ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్‌ రైళ్ల కోసం సర్వే ప్రారంభిస్తాం.” అన్నారు.

Read Also: Rathod Bapu Rao : కాంగ్రెస్ లో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

కాగా, దక్షిణాది రాష్ట్రం కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటాపోటీగా పర్యటిస్తున్నారు. కేరళలోని పాలక్కడ్‌లో జరిగిన ప్రచార సభలో ప్రధాని మోడీ పాల్గొనగా, రాహుల్ గాంధీ వయనాడ్​లో భారీ రోడ్​ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు చేసుకున్నారు.