Site icon HashtagU Telugu

Modi Vs Rahul : ‘యువరాజు’ను భారత ప్రధాని చేయాలని పాక్ తహతహ : ప్రధాని మోడీ

Pm Modi Vs Rahul Gandhi

Modi Vs Rahul : కాంగ్రెస్‌ యువరాజును(రాహుల్ గాంధీ) భారత తదుపరి ప్రధానమంత్రిగా చేయాలని పాకిస్తాన్ తహతహలాడుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. ఇందుకోసం పాకిస్తాన్‌కు చెందిన కొందరు నాయకులు ప్రార్థనలు కూడా చేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనలతో కాంగ్రెస్ పార్టీ, పాకిస్తాన్‌ల మధ్యనున్న అనుబంధం బయటపడిందని ప్రధాని చెప్పారు. రాహుల్ గాంధీకి అనుకూలంగా ఇటీవల సోషల్ మీడియాలో పలువురు పాకిస్తానీ నేతలు పెట్టిన పోస్టులను ఉద్దేశించి ప్రధాని ఈ కామెంట్స్ చేశారు. గుజరాత్‌లోని ఆనంద్ పట్టణంలో ఆనంద్, ఖేడా లోక్‌సభ స్థానాల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో మోడీ ప్రసంగించారు. ‘‘భారత్‌లో బలహీనమైన ప్రభుత్వం ఏర్పడాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. 26/11 ముంబై దాడుల నాటి ప్రభుత్వం, 2014కు ముందున్న సర్కారు మళ్లీ ఏర్పడితే తమ ఆటలు సాగుతాయని పాక్ అనుకుంటోంది’’ అని ఆయన కామెంట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

‘ఓట్ జిహాద్’‌ చేయాంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు మరియా ఆలం ఇచ్చిన పిలుపుపై ప్రధాని మోడీ(Modi Vs Rahul) ఫైర్ అయ్యారు.  ‘‘ఓట్ జిహాద్ గురించి మాట్లాడటం అంటే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. దీన్ని  ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఖండించలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ తర్వాత ఇప్పుడు ఇండియా కూటమి నేతలు ‘ఓట్ జిహాద్’ గురించి చెబుతున్నారు. దీని గురించి చెబుతున్నది మదర్సాలో చదువుకున్న వారు కాదు.. బాగా చదువుకున్న ముస్లిం కుటుంబానికి చెందిన మహిళ’’ అని ప్రధాని చెప్పారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటోంది. ఆ విధంగా చేయబోమని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వాలి’’ అని మోడీ కోరారు.

Also Read :prajwal : ప్రజ్వల్‌ రేవణ్ణకు మరోసారి లుకౌట్‌ నోటీసు

ప్రధాని మోడీపై శ్యామ్ రంగీలా పోటీ

శ్యామ్ రంగీలా.. ప్రముఖ హాస్యటుడు. నార్త్ ఇండియాలో ఈయన చాలా ఫేమస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ వంటి అగ్రనేతల గొంతులను అనుకరించి మిమిక్రీ చేయడంలో శ్యామ్ రంగీలా దిట్ట. తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోడీపై పోటీ చేస్తానని శ్యామ్ అనౌన్స్ చేశారు. వారణాసిలో పర్యటన, నామినేషన్ దాఖలు కార్యక్రమం, ఎన్నికల్లో పోటీ గురించి పూర్తి వివరాలతో త్వరలోనే ఓ వీడియోను విడుదల చేస్తానని ఆయన వెల్లడించారు.

Exit mobile version