Site icon HashtagU Telugu

Pm Modi: దేశం గొప్పదనం ఢిల్లీలో కాదు.. మారుమూల ప్రాంతంలో ఉంది!

Modi Loksabha Speech

Modi Loksabha Speech

Pm Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే చివరి సమావేశాలు కావడంతో దేశాభివృద్ధి సహా, పొలిటికల్ అంశాలను సైతం టచ్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ తీరును తూర్పారబట్టడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైనా మాట్లాడారు. నిధులు రావడం లేదని ఢిల్లీలో ఒక రాష్ట్రం ధర్నాకు దిగడం తనకు బాధకలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. తమకు రాష్ట్రాలపై వివక్ష లేదన్నారు. దక్షిణ భారతం కావాలని ధర్నా చేస్తారా? అని ప్రశ్నించారు.

‘బొగ్గు తమ రాష్ట్రంలో ఉంది.. మేమే వాడుకుంటామంటే ఎలా? నదులు మా రాష్ట్రంలో ఉన్నాయి మేమే వాడుకుంటామంటే కుదురుతుందా? మా రాష్ట్రం.. మా ట్యాక్స్‌ అంటారు.. ఇదక్కడి వితండవాదం. దేశం అంటే దేహం లాంటిది.. అన్ని ప్రాంతాలను సమానంగా చేస్తాం. రాష్ట్రాల హక్కులను అన్నిస్థాయిలో కాపాడుతాం’ అని స్పష్టం చేశారు.దేశం గొప్పదనం ఢిల్లీలో కాదు.. మారుమూల ప్రాంతంలో ఉందన్న ఆయన.. తమకు అన్ని రాష్ట్రాలు సమానమే అని పేర్కొన్నారు.కరోనా ముందు ప్రపంచం ఓడినప్పటికీ భారత్‌ గెలిచిందన్నారు ప్రధాని మోదీ. ఇందులో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయన్నారు.

దేశం గొప్పదనం ఢిల్లీలో కాదు.. మారుమూల ప్రాంతంలో ఉందన్న ఆయన.. ఈ కారణంగానే జీ20 భేటీలను దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించామన్నారు. దేశం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రాలకు కావాల్సినన్ని నిధులు ఇస్తామని, ఫెడరలిజానికి తమ మద్దతు ఉంటుందన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే పనిచేశానని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.

Exit mobile version