PM Modi: వారణాసిలోని క్రికెట్ స్టేడియంలో ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ

ప్రధాని నరేంద్ర మోదీ.. సిగ్రాలో నిర్మాణంలో ఉన్న స్టేడియం, క్రీడా ప్రాంగణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. మంగళవారం రాత్రి వారణాసిaలో జరుగుతున్న పనులను పరిశీలించారు

PM Modi: వరుసగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రెండు రోజుల పర్యటన నిమిత్తం కాశీకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. సిగ్రాలో నిర్మాణంలో ఉన్న స్టేడియం, క్రీడా ప్రాంగణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. మంగళవారం రాత్రి వారణాసిaలో జరుగుతున్న పనులను పరిశీలించారు. దీనికి ముందు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడతను ప్రధాని విడుదల చేశారు. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రార్థనలు చేసిన ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దశాశ్వమేధ ఘాట్ వద్ద జరిగిన హారతికి హాజరయ్యారు.

సిగ్రాలో నిర్మిస్తున్న స్టేడియం, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను సందర్శించేందుకు ప్రధాని మోదీ రాత్రి ఆకస్మికంగా ఇక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన సమాచారం తీసుకుని అవసరమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.

పూర్వాంచల్‌లోని క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసికి సిగ్రా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను బహుమతిగా ఇవ్వడం గమనార్హం. దీని నిర్మాణంతో ఇక్కడి యువత తమ క్రీడా ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది. ఇది రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని కూడా ప్రోత్సహిస్తుంది.

Also Read: Saudi Arabia: హీట్ స్ట్రోక్ కారణంగా 41 మంది హజ్ యాత్రికులు మృతి