Site icon HashtagU Telugu

PM Modi : ర‌ష్యాలో ఉగ్ర‌దాడిపై స్పందించిన ప్రధాని మోడీ

PM Modi responded to the terrorist attack in Russia

PM Modi responded to the terrorist attack in Russia

 

PM Modi: ప్రధాని మోడీ (PM Modi) రష్యా రాజధాని మాస్కో(Moscow)లోని క్రాకస్‌ సిటీ హాల్‌(Krakow City Hall)పై జరిగిన ఉగ్రవాద దాడి(terrorist attack)ని ఖండించారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్‌ చేశారు.

మాస్కోలోని (Mascow) క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి (Crocus City Hall) ప్రవేశించిన ఐదుగురు దుండగులు (Terror Attack) కాల్పులకు తెగబడ్డారు. దీంతో 60 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ఫిక్‌నిక్‌ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ (FSB) అధికారులు వెళ్లడించారు. ఈ కాల్పులకు బాధ్యతవహిస్తున్న ఐఎస్‌ఐఎస్‌ (ISIS) ప్రకటించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఒక్కసారిగా జరిగిన ఉగ్రదాడితో భయాందోళనలకు గురైన ప్రజలు హాలులో చైర్ల కింద దాక్కున్నారు. భవనంలో నుంచి బయటకు వస్తున్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల దాడితో కన్సర్ట్‌ హాల్‌లో మంటలు చెలరేగాయి. ఆ బిల్డింగ్‌ మొత్తం వ్యాపించడంతో భారీఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ దాడిలో ఐదురుగు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా వారిలో ఒకరు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తున్నది.

read also: Group 1 Alert : గ్రూప్-1 దరఖాస్తులో మార్పులు చేయాలా.. ఇవి తెలుసుకోండి