Cheetahs Video: నేషనల్ పార్కులోకి చిరుతలను వదిలిన మోడీ.. వీడియో ఇదిగో!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి ఎనిమిది చిరుతలను విడిచిపెట్టారు.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 12:54 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి ఎనిమిది చిరుతలను విడిచిపెట్టారు. ఎన్‌క్లోజర్ నంబర్ వన్ నుండి రెండు చిరుతలను విడిచిపెట్టారు. ఆ తర్వాత 70 మీటర్ల దూరంలో, రెండవ ఎన్‌క్లోజర్ నుండి మరొక చిరుతను విడిచిపెట్టారు. మిగతా చిరుతలను ఇతర ఎన్ క్లోజర్ ద్వారా పార్క్ లోకి విడిచిపెట్టారు. చిరుతలు 1952 నుంచి భారతదేశం లో అంతరించిపోయినట్లు ప్రకటించబడ్డాయి.

అయితే నేడు ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా ఆఫ్రికాలోని నమీబియా నుండి 8 చిరుతలను (5 ఆడ మరియు 3 మగ) తీసుకువచ్చారు. చీతా ప్రాజెక్ట్‌లో భాగంగా ఎనిమిది చిరుతలను గ్వాలియర్‌లోని కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లో తీసుకొచ్చారు. తరువాత, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి కునో నేషనల్ పార్క్‌కి చిరుతలను తరలించారు. శాటిలైట్ ద్వారా పర్యవేక్షించేందుకు అన్ని చిరుతలకు రేడియో కాలర్‌లను ఏర్పాటు చేశారు. ఇది కాకుండా, ప్రతి చిరుత వెనుక ఒక ప్రత్యేక పర్యవేక్షణ బృందం ఉంది.