Site icon HashtagU Telugu

PM Modi: ప్ర‌ధాని మోదీకి ర‌ష్యా అత్యున్న‌త పౌర పుర‌స్కారం..!

PM Modi

PM Modi

PM Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ని రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌తో సత్కరించారు. అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు గౌరవమని అన్నారు. ఇది భారతదేశం- రష్యా మధ్య అనాదిగా ఉన్న స్నేహానికి ప్రతిబింబమ‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు.

రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’తో ఈరోజు క్రెమ్లిన్‌లో ప్రధాని మోదీని సత్కరించారు. రష్యా, భారత్‌ల మధ్య ప్రత్యేక దౌత్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు ప్రధాని మోదీకి ఈ గౌరవం దక్కనుంది. ఇంతకు ముందు కూడా చాలా దేశాలు ప్రధాని మోదీని తమ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాయి.

Also Read: CM Revanth Challenge : హరీష్.. కేటీఆర్ నా సవాల్ కు సిద్ధమా..? -రేవంత్ రెడ్డి

భారతదేశం- రష్యా ప్రజలకు మంచి భవిష్యత్తు గురించి ప్రధాని మాట్లాడారు. అన్ని రంగాల్లో సంబంధాలు బలోపేతం కావాల్సి ఉందన్నారు. ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామ‌న్నారు. ఇటువంటి నిర్ణయాలు రెండు దేశాలకే కాకుండా యావత్ ప్రపంచానికి మేలు చేస్తాయని తెలిపారు. భారత్-రష్యా భాగస్వామ్యం ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. శాంతి, స్థిరత్వం కోసం ప్రయత్నాలు కొనసాగాలని మేము విశ్వసిస్తాము. ఈ దిశగా నిరంతరం కృషి చేస్తామ‌ని తెలిపారు.

పుతిన్‌ను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య మీరు వేసిన వ్యూహాత్మక సంబంధాల పునాది కాలం గడిచేకొద్దీ బలపడిందని అన్నారు. ప్రజల భాగస్వామ్యంపై ఆధారపడిన మ‌న‌ పరస్పర సహకారం మన ప్రజలలో భవిష్యత్తుకు ఆశాజనకంగా, హామీగా మారుతోందని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల రష్యా పర్యటన నిమిత్తం మాస్కో చేరుకున్నారు. రష్యాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ స్వయంగా విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ పరిచారు. ప్రధాని మోదీని కూడా గార్డ్ ఆఫ్ హానర్‌తో సత్కరించారు.

We’re now on WhatsApp. Click to Join.