Rajasthan road accident incident : రాజస్థాన్‌లోని ధోల్పుర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది చిన్నారులతో సహా 12 మంది మృతి చెందారు. అయితే ఈ ఘనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ‘ఈ ప్రమాదం హృదయ విదారకం. అమాయక చిన్నారులతో సహా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ బాధను తట్టుకునే శక్తి బాధితుల కుటుంబాలకు భగవంతుడు ప్రసాదించాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను ‘ అని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు.
రాజస్థాన్‌లోని గుమత్ మొహల్లాకు చెందిన బాధితులు సర్ముతురా ప్రాంతంలోని బరౌలీలో ఓ వివాహ వేడుకలో పాల్గొని టెంపోలో వస్తున్నారు. ఈ క్రమంలో ఓ బస్సు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. 10 మంది ఘటనా స్థలంలో మృతి చెందగా.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో ఇద్దరు మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం ధోల్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అదనంగా, మృతుల మృతదేహాలను బారి ఆసుపత్రి మార్చురీలో ఉంచారు , దర్యాప్తు ప్రారంభించబడింది.