Ambedkar : ప్రధాని మోడీ అంబేద్కర్ వివాదంపై స్పందించారు. ఈ మేరకు ఆయన ఈరోజు తన ఎక్స్ అకౌంట్‌లో రియాక్ట్ అయ్యారు. అంబేద్కర్ విజిన్‌ను పూర్తి చేసేందుకు గత దశాబ్ధ కాలం నుంచి తమ నిర్విరామంగా కృషి చేస్తున్నామన్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి తొలగించామన్నారు. అంబేద్కర్ వల్లే తాము ఇక్కడ ఉన్నట్లు మోడీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశామన్నారు. స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఉజ్వల్ యోజన లాంటి తమ పథకాలన్నీ పేద, అణగారిన ప్రజల జీవితాలను మార్చినట్లు వెల్లడించారు.
దశాబ్ధాలుగా ఓ పార్టీ, ఓ కుటుంబం.. అన్ని రకాలుగా అంబేద్కర్ వారసత్వాన్ని, ఎస్సీ, ఎస్టీ వర్గాలను నిర్వీర్యం చేసిందని ప్రధాని తన ట్వీట్‌లో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తోందని, ఆ పార్టీ అబద్దాలతో అంబేద్కర్‌ను అవమానిస్తోందని, వాళ్లు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రధాని మోడీ ఆరోపించారు. అంబేద్కర్‌తో లింకున్న అయిదు ప్రాంతాలను తమ ప్రభుత్వం డెవలప్ చేస్తోందన్నారు. చైత్య భూమి అభివృద్ధి అంశం కొన్ని దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. అయితే ఆ అంశాన్ని తమ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు.
లండన్‌లో ఆయన నివసించిన ఇంటిని కూడా స్వాధీనం చేసుకుని డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్‌కు ఇచ్చే గౌరవం, మర్యాదలో లోటు లేదన్నారు. ఢిల్లీలోని అలీపూర్ రోడ్డులో అంబేద్కర్ తన చివరి రోజుల్ని గడిపారని, ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాక..అంబేద్కర్ అంశంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు.. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలను ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కలిశారు.
Read Also: Laapataa Ladies : ఆస్కార్ రేస్ నుండి తప్పుకున్న ‘లాపతా లేడీస్’