అమెరికా టాప్ 5 కంపెనీల‌పై మోఢీ .. టెక్నాల‌జీలో భారీ పెట్టుబ‌డుల‌కు గ్రీన్ సిగ్న‌ల్

అమెరికాలోని టాప్ 5 కంపెనీల సీఈవోల‌తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది. టాప్ 5 కంపెనీల సీఈవోల‌లో ఇద్ద‌రు ఇండియ‌న్ మూలాలు ఉన్న సీఈవోలు కావ‌డం విశేషం.

  • Written By:
  • Publish Date - September 23, 2021 / 01:39 PM IST

అమెరికాలోని టాప్ 5 కంపెనీల సీఈవోల‌తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది. టాప్ 5 కంపెనీల సీఈవోల‌లో ఇద్ద‌రు ఇండియ‌న్ మూలాలు ఉన్న సీఈవోలు కావ‌డం విశేషం. టెక్నాల‌జీ, మిల‌ట‌రీ ఉప‌యోగించే డ్రోన్ల సాంకేత‌క‌త‌కు సంబంధించిన ఒప్పందాలు పెట్టుబ‌డుల వ‌ర‌ద‌ను కురిపించ‌బోతున్నాయి. అడ‌బ్ కంపెనీ సీఈవో శంత‌న్ నారాయ‌న్ , జ‌న‌ర‌ల్ అటామిక్ సీఈవో వివేక్ లాల్ ఇండియా మూలాలు ఉన్న సీఈవోలు. క్వాల్క‌మ్ సీఈవో క్రిస్టియానో ఈ అమ‌న్ , ఫ‌స్ట్ సోలార్ కంపెనీ సీఈవో మార్క్ విడ్ మ‌ర్, బ్లాక్ స్టోన్ కంపెనీ సీఈవో స్టీఫెన్ ఏ స్కార్జ్ మెన్ ల‌తో మోడీ భేటీ కీల‌కంగా జ‌ర‌గ‌నుంది. వాషిగ్ట‌న్ డీసీలో దిగిన మోడీ మ‌రో రెండు రోజులు అక్క‌డే ఉంటారు. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాల క‌మ‌లాహారిస్ తో ప్ర‌ధాని మోడీ కీల‌క ఒప్పందాలు చేసుకుంటారు.
భార‌త‌దేశంలోని ఆర్థిక సానుకూల‌త‌ల‌ను క్యాడ్ స‌మావేశంలో మోడీ వివ‌రిస్తారు. ఆస్త్రేలియా, జ‌పాన్ ప్ర‌ధానులు పాల్గొనే ఈ స‌మావేశంలో భార‌త్ వ్యాపార‌, వాణిజ్య అంశాల‌పై ఫోక‌స్ పెడ‌తారు. ఐటీ, డిజిట‌ల్ టెక్నాల‌జీ గురించి నారాయ‌న‌న్ తోనూ మిల‌ట‌రీ డ్రోన్ల టెక్నాల‌జీపై లాల్ తో మోడీ చ‌ర్చిస్తారు. అమెరికా, భార‌త్ భాగ‌స్వామ్యంతో టెక్నాల‌జీని షేర్ చేసుకునే ఒప్పందాన్ని చేసుకుంటారు. ర‌క్ష‌ణ ఒప్పందాల్లో భాగంగా సుమారు 18 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన డ్రోన్ల టెక్కాల‌జీని భార‌త్ పొంద‌డానికి వీలుంది. సాఫ్ట్ వేర్, సెమీ కండ‌క్ట‌ర్స్, 5జీ టెక్కాల‌జీ, వైర్ లెస్ టెక్నాల‌జీతో సేవ‌ల‌ను అందించే ఒప్పందాలు చేసుకుంటారు. క్వాల్క‌మ్ కంపెనీ పెద్ద మొత్తంలో భార‌త్ లో పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. భార‌త ప్ర‌భుత్వానికి ఆ మేర‌కు అనుకూల‌మైన నిర్ణ‌యం తీసుకుంది.
బ్లాక్ స్టోన్ త‌న టెక్నాల‌జీ ద్వారా భార‌త్ లో విస్త‌రించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. పెద్ద ఎత్తున లాజిస్టిక్ లావాదేవీల‌ను చేయ‌డానికి అనువైన టెక్నాల‌జీను పంచుకోవ‌డానికి ఆ కంపెనీ సిద్ధం అయింది. మొత్తం మీద మొద‌టి రోజు టాప్ 5 కంపెనీల సీఈవోల‌తో స‌మావేశ‌మైన ప్ర‌ధాని ఆశించిన మేర‌కు ఆ కంపెనీల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు. రాబోయే రోజుల్లో టాప్ 5 కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు ఇండియాకు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నారు. ఆ మేర‌కు ఒప్పందాలు చేసుకోవ‌డం శుభ‌ప‌రిణామం.