PM Modi: `ప్రొఫైల్ పిక్` ను మార్చేసిన మోడీ

ప్రొఫైల్ పిక్స్ గా జాతీయ జెండాను ఉంచాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పిలుపును ఇచ్చారు.

  • Written By:
  • Updated On - August 2, 2022 / 03:27 PM IST

ప్రొఫైల్ పిక్స్ గా జాతీయ జెండాను ఉంచాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పిలుపును ఇచ్చారు. అంతేకాదు, ఆయ‌న ట్విట్ట‌ర్‌ ఖాతా ప్రొఫైల్ ను కూడా మార్చేశారు. ప్రొఫైల్ పిక్ గా జాతీయ పతాకాన్ని పెట్టుకున్నారు. మంగళవారం ఈ మార్పు కనిపించింది. ఆగస్ట్ 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకోవాలంటూ ప్రధాని మోదీ పిలుపునివ్వడం గ‌మ‌నార్హం. ప్రధానికి చెందిన సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్ గా త్రివర్ణ పతాకం కనిపిస్తోంది. ఇదంతా ఒక ఉద్య‌మంగా చేయాల‌ని ఆయ‌న ఉవాచ‌.

Also Read: Liger With Chiru & Salman: లైగర్ టీంతో ‘బాస్ అండ్ భాయ్’ సందడి!

‘‘నేడు ప్రత్యేకమైన ఆగస్ట్ 2. అజాదీకా అమృత్ మహోత్సవాలను జరుపుకుంటున్న వేళ. యావత్ దేశం హర్ ఘర్ తిరంగా కోసం సిద్ధంగా ఉంది. త్రివర్ణ పతాకాన్ని సంబరంగా జరుపుకునేందుకు సమష్టి చర్యలు అవసరం. నా సోషల్ మీడియా పేజీల్లో డీపీని మార్చాను. మీరు కూడా అదే పని చేయాలి’’ అని ప్రధాని కోరారు. ఆ మేర‌కు ట్వీట్ చేశారు. ఆయ‌న ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా ప్రొఫైల్ పిక్ లను మార్చుకున్నారు.

ప్ర‌ధాన మోడీ ఇచ్చిన పిలుపుకు కోట్లాది మంది భార‌తీయుల ప్రొఫైల్ పిక్ ను మార్చేసుకుంటున్నారు. క‌రోనా సంద‌ర్భంగా మోడీ ఇచ్చిన పిలుపుకు స్పందించిన ప్ర‌జ‌లు దీపాలు వెలిగించారు. చ‌ప్ప‌ట్లు కొట్టారు. అదే త‌ర‌హాలో ఇప్పుడు ప్రొఫైల్ పిక్ ల‌ను మార్చ‌డానికి ప్ర‌జ‌లు ముందుకొస్తున్నార‌ని బీజేపీ భావిస్తోంది.