Site icon HashtagU Telugu

PM Modi: 8 గంటల క్యాబినెట్ భేటీలో మోడీ కీలక నిర్ణయాలు

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం మంత్రి మండలి ఎనిమిది గంటల పాటు సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే విజన్ న హైలైట్ చేశారు. అంతేకాదు మే నెలలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం తొలి 100 రోజులు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. నిజానికి మోడీ ప్రభుత్వ హయాంలో మంత్రి మండలి నిర్వహించిన చివరి సమావేశం ఇదే. సార్వత్రిక ఎన్నికలపై షెడ్యూల్ వారంలోపు వెలువడే అవకాశం ఉంది. ఏప్రిల్‌ నుంచి మే మధ్యకాలం వరకు ఏడు నుంచి ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఆదివారం నాటి సమావేశంలో డెవలప్‌డ్ ఇండియా-2047 విజన్ డాక్యుమెంట్ మరియు వచ్చే ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికపై ప్రధానంగా చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాబోయే 25 ఏళ్లలో ఎలాంటి ఆర్థికాభివృద్ధి జరగాలన్న దానిపై సంబంధిత వర్గాలు భేటీలో తెలిపాయి. వ్యాపారం చేయడంలో ఎలాంటి సౌలభ్యం ఉండాలి, జీవన సౌలభ్యం, సామాజిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎలాంటి లక్ష్యాలు ఉండాలి అనే అంశాలపై కూడా చర్చించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గత నెల రోజులుగా ప్రధాని మోదీ బహిరంగ వేదికలపై పలుమార్లు చెప్పడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో గెలిచి తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద శక్తిగా మారుస్తానని చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది.

సోమవారం నుండి మోడీ రాబోయే కొద్ది రోజుల పాటు రాష్ట్రాలలో నిరంతర పర్యటనలో పాల్గొంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఎన్నికల ర్యాలీలు కూడా నిర్వహించనున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాజకీయ వేడి మొదలైంది. అటువంటి పరిస్థితిలో అనవసరమైన ప్రకటనలకు దూరంగా ఉండాలని క్యాబినెట్ మంత్రులను మోడీ ఆదేశించారు.

Also Read: Prashant Kishor : ఏపీలో టీడీపీ గెలుపు ఖాయం..?

Exit mobile version