Site icon HashtagU Telugu

Modi Pays Tribute: వీరులకు మోడీ నివాళులు

Fgljzuivuachba3 Imresizer Logo Imresizer

PM MODI

తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ స్టాఫ్ కి ప్రధాని మోదీ నివాళులర్పించారు.
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు 13 మంది భౌతికకాయాలకు ప్రధానమంత్రి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు.

చనిపోయిన ఆర్మీ స్టాఫ్ భౌతికకాయాలను C-130J అనే
ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టకు తరలించారు. జనరల్‌ రావత్, మధులికతో పాటు బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిడ్డర్, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్, వింగ్‌ కమాండర్‌ పీఎస్‌ చౌహాన్, స్క్వాడ్రన్‌ లీడర్‌ కే సింగ్, నాయక్‌ గురుసేవక్‌సింగ్, నాయక్‌ జితేందర్‌ కుమార్, లాన్స్‌నాయక్‌ వివేక్, లాన్స్‌ నాయక్‌ బీ సాయితేజ, హవల్దార్‌ సత్పాల్, జేడబ్ల్యయో దాస్, ప్రదీప్‌ మృతదేహాలకు ఎయిర్ పోర్ట్ లో పలువురు ప్రముఖులు కూడా నివాళి అర్పించారు.

రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడాచనిపోయిన ఆర్మీ స్టాఫ్ కు నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. త్రివిధ దళాధిపతులు కూడా మృతదేహాలకు నివాళులు అర్పించారు.

తమిళనాడులోని సుల్లూరు ఎయిర్‌బేస్‌ నుంచి ఈ విమానం ఢిల్లీకి బయలుదేరేప్పుడు ఎయిర్‌బేస్‌కు అంబులెన్స్‌లు వస్తున్న సమయంలో స్థానికులు అమర జవాన్లకు ఘననివాళి అర్పించారు. జవాన్ల మృతదేహాలను తీసుకొస్తున్న అంబులెన్స్‌లపై పూలవర్షం కురిపించారు . బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంపై కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తకు ఆదేశించింది. ఎయిర్‌మార్షల్ మాన్వెందర్‌సింగ్‌ నేతృత్వం లోని త్రిసభ్య కమిటీ విచారణ జరిపి నివేదికను ఇస్తుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌కు తెలిపారు.