PM Modi : షిర్డీ సాయికి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోడీ

ఆలయంలో కొత్త దర్శన సముదాయాన్ని బహుమతిగా ఇచ్చారు మోడీ. ఇది క్లాక్ రూమ్, టాయిలెట్, బుకింగ్ కౌంటర్, సమాచార కేంద్రం వంటి ఎయిర్ కండిషన్డ్ పబ్లిక్ సౌకర్యాలను కలిగి ఉంది

  • Written By:
  • Publish Date - October 26, 2023 / 08:45 PM IST

ప్రధాని మోడీ (PM Modi) మహారాష్ట్ర (Modi Maharashtra Tour)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ సాయి బాబా (Shri Saibaba Samadhi Temple ) ను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రధాని మోడీ పూర్తి ఆచార వ్యవహారాలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రధాని మోడీ వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఉన్నారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న మోడీకి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ఆలయంలో కొత్త దర్శన సముదాయాన్ని బహుమతిగా ఇచ్చారు మోడీ. ఇది క్లాక్ రూమ్, టాయిలెట్, బుకింగ్ కౌంటర్, సమాచార కేంద్రం వంటి ఎయిర్ కండిషన్డ్ పబ్లిక్ సౌకర్యాలను కలిగి ఉంది. ఈ కొత్త కాంప్లెక్స్‌లో దాదాపు 10 వేల మంది భక్తులు కూర్చునే సామర్థ్యం ఉంది. అలాగే అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న నీల్వాండే డ్యామ్, ‘జల్ పూజన్’ డ్యామ్ ఎడమ ఒడ్డున ఉన్న కాలువ ఆనకట్టను ప్రధాని మోడీ ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడుతూ..“మహారాష్ట్రలో కొంతమంది రైతుల పేరుతో మాత్రమే రాజకీయాలు చేశారు. మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నాయకుడు దేశ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. నేను వ్యక్తిగతంగా ఆయనను గౌరవిస్తాను, కానీ ఆయన రైతులకు ఏమి చేశాడు?” అని పవార్ పేరు చెప్పకుండా ప్రధాని మోడీ విమర్శలు చేసారు. పవార్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతులు దళారుల దయతో ఉండేవారని మోడీ అన్నారు. నెలల తరబడి రైతులు తమ డబ్బుల కోసం నిరీక్షించాల్సి వచ్చిందని, మా ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే ఎంఎస్‌పీ సొమ్మును జమ చేసిందని ప్రధాని స్పష్టం చేశారు.

Read Also : CM KCR : మునుగోడులో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము – కేసీఆర్