PM Modi Meets Survivor : మృత్యుంజయుడిని పరామర్శించిన ప్రధాని మోడీ

PM Modi Meets Survivor : ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన బ్రిటిష్ వ్యక్తి మహేష్ ( Mahesh Vishwas Kumar ) ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పరామర్శించారు

Published By: HashtagU Telugu Desk
Modi Mahesh

Modi Mahesh

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదం (Ahmedabad plane crash) దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఎయిర్ ఇండియా కు చెందిన AI171 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం (AI171 Boeing 787 Dreamliner aircraft), సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించగా, ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు విదేశీ ప్రయాణికులు కూడా ఉన్నారు. విమానం బీజే మెడికల్ కాలేజీ ప్రాంగణంలో కూలిపోవడంతో అక్కడి విద్యార్థులు, వైద్యులు కూడా గాయపడ్డారు.

Plane Crash : మేడే కాల్ అంటే ఏంటి..? ఏ పరిస్థితుల్లో ఈ కాల్ పంపుతారు..?

విమాన ప్రమాద స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్వయంగా సందర్శించారు. ప్రధాని వెంట కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌కి వెళ్లిన ప్రధాని, మృతుల కుటుంబాలను పరామర్శించారు. అలాగే గాయపడిన వారిని చూసి ధైర్యం చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన బ్రిటిష్ వ్యక్తి మహేష్ ( Mahesh Vishwas Kumar ) ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పరామర్శించారు.

Ahmedabad : విమాన ప్రమాదం.. సహాయక చర్యలకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ సిద్ధం: ముకేశ్‌ అంబానీ

ప్రస్తుతం సంఘటన స్థలంలో NDRF బృందాలు, రాష్ట్ర-కేంద్ర విపత్తు స్పందనా దళాలు కలిసి శిథిలాల తొలగింపు, శవాల గుర్తింపు పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. ఎయిర్ ఇండియా బాధితుల కుటుంబాల కోసం అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, లండన్ గాట్‌విక్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదం దేశమంతటా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించగా, విమాన ప్రయాణ భద్రతపై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కారణాలపై దర్యాప్తు కొనసాగుతుండగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

  Last Updated: 13 Jun 2025, 11:19 AM IST