Sunita Williams : ప్రధాని మోడీ ఇండో-అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌కు లేఖ రాశారు. భారత్‌కు రావాలని లేఖ ద్వారా ఆహ్వానం పలికారు. సునీతా విలియమ్స్, విల్మోర్‌లు అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలలుగా అక్కడ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాసా వారిని భూమి మీదకు తీసుకురావడానికి ఇటీవల ఫాల్కన్-9 రాకెట్‌ను పంపింది. ఈ రాకెట్ ద్వారా మరికొన్ని గంటల్లో సునీతా భూమిపైకి రానుండడంతో భారత్‌కు రావాలని ప్రధాని లేఖ రాశారు.
Read Also: Junaid Khan: తీవ్ర విషాదం.. ఎండ కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్ మృతి
ఇక ఈ లేఖను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మోడీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖలో సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమ్మీదకు చేరాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఆమె వేలమైళ్లు దూరంలో ఉన్నా.. మన హృదయాలకు దగ్గరగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు అని గుర్తు చేశారు. ఈ నెలలో ఢిల్లీలో నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో జరిగిన సమావేశంలో సునీత విలియమ్స్ పేరును ప్రస్తావనకు తేవడమే కాదు, ఆమె సేవల్ని తమ సంభాషణలో ప్రస్తావనకు వచ్చిందని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు.
కాగా, ప్రధాని మోడీ గతంలో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఆయన్ను కలిశారు. అలాగే ఇటీవల అమెరికా వెళ్లి వైట్ హౌజ్‌లో డోనాల్డ్ ట్రంప్‌తోనూ భేటీ అయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ సునీత విలియమ్స్ యోగక్షేమాల గురించి వారిని ఆరాతీసినట్లు ప్రధాని మోడీ తెలిపారు. 2024 జూన్ లో సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లారు. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం అక్కడ వారు వారం రోజులే ఉండాల్సి ఉంది. కానీ వారు వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది ఖాళీగా భూమిమీదకు తిరిగొచ్చింది. వారు మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. ఇక డిసెంబర్‌లో ఒకసారి, ఈ ఏడాది జనవరి చివర్‌లో మరోసారి ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ఎక్స్ ప్రయత్నించాయి. కానీ పలు సాంకేతిక సమస్యలతో ఆ ప్రయత్నాల్లో ముందడుగు పడలేదు. ఎట్టకేలకు 9 నెలల తరువాత ఇప్పుడు సునిత విలియన్స్, బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు భూమ్మీదకు తిరిగొస్తున్నారు.