PM Modi: జమ్ముకశ్మీర్ ప్రజలకు ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్వేచ్ఛః ప్రధాని మోడీ

  PM Modi Kashmir: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కశ్మీర్‌ లోయలోని శ్రీనగర్‌(Srinagar)లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియం(Bakshi Stadium)లో ప్రధాని మోడీ రూ.6400 కోట్ల విలువైన 53 ప్రాజెక్ట్​లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీ కశ్మీర్​ లోయలో పర్యటించడం ఇదే తొలిసారి. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో(Bakshi Stadium) ‘విక్షిత్ భారత్ విక్షిత్ జమ్ముకశ్మీర్’ […]

Published By: HashtagU Telugu Desk
PM Modi

Pm Modi Launches 53 Project

 

PM Modi Kashmir: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కశ్మీర్‌ లోయలోని శ్రీనగర్‌(Srinagar)లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియం(Bakshi Stadium)లో ప్రధాని మోడీ రూ.6400 కోట్ల విలువైన 53 ప్రాజెక్ట్​లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీ కశ్మీర్​ లోయలో పర్యటించడం ఇదే తొలిసారి.

శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో(Bakshi Stadium) ‘విక్షిత్ భారత్ విక్షిత్ జమ్ముకశ్మీర్’ ( Viksit Bharat Viksit Jammu and Kashmir)కార్యక్రమంలో షోపియాన్, జమ్ము, కుప్వారా, శ్రీనగర్, గందర్‌బల్, బందీపురా, కథువాకు చెందిన ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్​గా సంభాషించారు.

భారతదేశానికి జమ్ముకశ్మీర్​ తలమానికమని ప్రధాని మోడీ అన్నారు. శ్రీనగర్ ఇప్పుడు దేశ పర్యాటక పరిశ్రమకు కేంద్రంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. శ్రీనగర్‌లోని అద్భుతమైన వ్యక్తుల మధ్య ఉన్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. భూమిపై ఉన్న స్వర్గానికి(శ్రీనగర్​ను ఉద్దేశించి) వచ్చిన అనుభూతి మాటల్లో చెప్పలేనిదని పేర్కొన్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను తాకుతోందని ప్రధాని మోడీ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ జమ్ముకశ్మీర్ ప్రజలను మాత్రమే కాదు, యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ‘చలో ఇండియా’ కార్యక్రమం కింద కనీసం 5 మంది కుటుంబ సభ్యులను భారత పర్యటనకు పంపాలని ప్రవాస భారతీయులను ప్రధాని కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని ప్రధాని మోడీ తెలిపారు. దశాబ్దాలుగా రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు 370 పేరుతో జమ్ముకశ్మీర్ ప్రజలను, దేశాన్ని తప్పుదోవ పట్టించాయని విమర్శించారు. ‘భవిష్యత్తులో జమ్ముకశ్మీర్ విజయగాథ ప్రపంచానికి కేంద్రంగా నిలుస్తుంది. జమ్ముకశ్మీర్​లోని సరస్సుల్లో ఎక్కడ చూసినా కమలం కనిపిస్తుంది. జమ్ముకశ్మీర్ క్రికెట్ లోగోపై కూడా కమలం గుర్తు ఉంది. బీజేపీ గుర్తు కూడా కమలమే. జమ్ముకశ్మీర్‌కు కమలంతో లోతైన అనుబంధం ఉండడం యాదృచ్చికమా లేక ప్రకృతి సంకేతమా?’ అని మోడీ తెలిపారు.

read also : Richest Man: ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడు ఎవ‌రో తెలుసా..? మ‌స్క్‌, బెజోస్ కాదు..!

తాను ఎల్లప్పుడూ జమ్ముకశ్మీర్ ప్రజలను కుటుంబంలా భావిస్తానని ప్రధాని మోడీ చెప్పారు. ‘కుటుంబ సభ్యులు నా హృదయంలో ఉంటారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి నేను హామీ ఇస్తున్నాను. జమ్ముకశ్మీర్​లో అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవు.’ అని ప్రధాని మోడీ తెలిపారు.

 

  Last Updated: 07 Mar 2024, 02:52 PM IST