G20 Summit : రోమ్ ప‌ర్య‌ట‌న‌లో మోదీ. భార‌త్‌కు రావాల‌ని పోప్‌కు ఆహ్వానం

రోమ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త ప్ర‌ధాని మోడీ..పోప్ ఫ్రాన్సిస్‌ను భార‌త్‌కు ఆహ్వానించారు. గంట పాటు పోప్‌తో స‌మావేశ‌మైన మోడీ.. వాతావ‌ర‌ణ మార్పులపై చ‌ర్చ‌లు జ‌రిపారు.

Published By: HashtagU Telugu Desk

రోమ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త ప్ర‌ధాని మోడీ..పోప్ ఫ్రాన్సిస్‌ను భార‌త్‌కు ఆహ్వానించారు. గంట పాటు పోప్‌తో స‌మావేశ‌మైన మోడీ.. వాతావ‌ర‌ణ మార్పులపై చ‌ర్చ‌లు జ‌రిపారు. జీ 20 స‌ద‌స్సు నేప‌ధ్యంలో జ‌రిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌లు కూడా పాల్గొన్నారు.

పోప్‌ ఫ్రాన్సిస్‌తో సమావేశం ముగిసిన తర్వాత.. ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో ఫోటోలను షేర్ చేశారు. ‘పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశం చాలా ఆహ్లాదంగా జరిగింది. ఆయనతో విస్తృత శ్రేణి సమస్యల గురించి చర్చించే అవకాశం నాకు లభించింది.. భారతదేశాన్ని సందర్శించాలని కూడా నేను ఆహ్వానించాను’ అని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు.

కరోనా కారణంగా గత ఏడాది జి-20 సదస్సు వర్చువల్‌గా నిర్వహించారు. ఇటలీ పర్యటన అనంతరం మోదీ.. కాప్‌-26 సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్‌ బయల్దేరి వెళతారు.

  Last Updated: 30 Oct 2021, 05:37 PM IST