PM Modi : గుజరాత్ లో ప్రతిష్టాత్మక ” ఇన్ – స్పేస్ ఈ” .. ప్రారంభించిన మోడీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ లో శుక్రవారం రూ.3050 కోట్లు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

  • Written By:
  • Publish Date - June 10, 2022 / 03:03 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ లో శుక్రవారం రూ.3050 కోట్లు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో అత్యంత కీలకమైనది అహ్మదాబాద్ లోని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్ – స్పేస్ ఈ). అంతరిక్ష విజ్ఞాన రంగంలో ప్రయివేట్ రంగానికి ప్రోత్సహించే ప్రధాన కేంద్రంగా “ఇన్ – స్పేస్ ఈ ” సేవలు అందించనుంది. స్పేస్ లాంచ్ వెహికిల్స్ అభివృద్ధి, శాటిలైట్ల తయారీ చేపట్టే ప్రైవేటు రంగ అంతరిక్ష కంపెనీలకు అనుమతులు ఇచ్చే సింగిల్ విండోగా “ఇన్ – స్పేస్ ఈ ” వ్యవహరించనుంది.

మనవరాలి పేరిట L & T అధినేత నిర్మించిన క్యాన్సర్ ఆస్పత్రి..

L & T వ్యాపార గ్రూప్ అధినేత ఏ.ఎం.నాయక్ గురించి తెలియని వారుండరు. ఆయన మనవరాలు
నిరాళి రెండేళ్ల వయసులోనే క్యాన్సర్ తో కన్నుమూసింది. ఆమె స్మారకార్ధం గుజరాత్ లోని ” నవ్సారి ” జిల్లాలో ఏ.ఎం.నాయక్ నిర్మించిన నిరాళి క్యాన్సర్ ఆస్పత్రిని మోడీ ప్రారంభించారు. ఏ.ఎం.నాయక్ హెల్త్ కేర్ కాంప్లెక్స్ ను కూడా ప్రారంభించారు. కాగా, గుజరాత్ గౌరవ్ అభియాన్ లోని భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ మొదలుపెట్టారు.