Nalanda University : బిహార్‌లోని రాజ్ గిర్‌లో శిథిలమైన పురాతన నలంద యూనివర్సిటీ సమీపంలోనే కొత్త యూనివర్సిటీ క్యాంపస్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ప్రారంభించారు. ఈ క్యాంపస్‌ను నలంద యూనివర్సిటీ పాత నమూనాలోనే నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి 17 దేశాల రాయబారులతో పాటు కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ హాజరయ్యారు. అంతకుముందు రాజ్‌గిర్‌కు చేరుకోగానే కొత్త నలందా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని నలంద విశ్వవిద్యాలయం పురాతన శిథిలాలను ప్రధాని మోడీ సందర్శించారు. అవి భారత వారసత్వ సంపదలో ఒక భాగం. రాజ్ గిర్‌లో నలందా వర్సిటీ (Nalanda University) కొత్త క్యాంపస్‌ను నిర్మించే ప్రతిపాదనకు తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి.
నలంద వర్సిటీ చరిత్ర
- నలంద విశ్వవిద్యాలయాన్ని క్రీస్తుశకం 427లో స్థాపించారు.
- ఇదే ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యూనివర్సిటీ అని చెబుతుంటారు.
- అప్పట్లోనే తూర్పు ఆసియా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి 10వేల మందికిపైగా విద్యార్థులు ఇక్కడి వచ్చి చదువుకునేవారట.
- క్రీస్తుశకం 1190 సమయంలో తుర్కో-అప్గాన్ మిలటరీ జనరల్ భక్తియార్ ఖిల్జీ నేతృత్వంలోని దళాలు ఉత్తర, తూర్పు భారత దేశంపై దండయాత్ర చేశాయి. ఆ దండయాత్రలలోనే నలంద విశ్వవిశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశారని చెబుతారు.
We’re now on WhatsApp. Click to Join
కొత్త క్యాంపస్‌లో ఏమున్నాయి ?
- నలందా యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌లో 40 తరగతి గదులు, 300 సీట్ల కెపాసిటీతో కూడిన రెండు ఆడిటోరియంలు ఉన్నాయి.
- దాదాపు 550 మంది విద్యార్థుల కోసం ఒక హాస్టల్ ఉంది.
- 2,000 సీట్ల యాంఫి థియేటర్ ఉంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది.
- అంతర్జాతీయ కేంద్రంతో రెండు విద్యా భవనాలు ఉన్నాయి.
- వివిధ దేశాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులకు నలందా యూనివర్సిటీ ఆతిథ్యం ఇవ్వనుంది.
- నలందా యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ రీసెర్చ్ కోర్సులు, స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సులు, అంతర్జాతీయ విద్యార్థుల కోసం 137 రకాల స్కాలర్‌షిప్‌లను అందించనుంది.