Sela Tunnel : సేలా టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 12:27 PM IST

 

Sela Tunnel : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లో కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సేలా టన్నెల్‌ (Sela Tunnel)ను శనివారం ప్రారంభించారు. ఇండియా – చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్‌లో నిర్మించిన ఈ టన్నెల్‌ ప్రపంచంలోనే అతి పొడవైనది (world’s longest bi-lane tunnel). బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ రెండు వరుసలతో దీన్ని నిర్మించింది. ఈ టన్నెల్‌ వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. దీని ద్వారా మరింత వేగంగా సైనిక బలగాల రాకపోకలు సాగించవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సేలా టన్నెల్‌ను సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. మొత్తం రూ.825 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ రెండు వరుసల టన్నెల్‌ మొత్తం పొడవు సుమారు 12 కిలోమీటర్లు. టన్నెల్‌ – 1 సింగిల్‌ ట్యూబ్‌తో 980 మీటర్ల పొడవు ఉంటుంది. టన్నెల్‌ -2 ట్విన్‌ ట్యూబులతో 1,555 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు 2019 ఫిబ్రవరి 9న ప్రధాని మోడీ శంకుస్థాపన చేయగా.. అదే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు.

read also : BJP Alliance TDP : టీడీపీ కూటమితో బిజెపి పొత్తు ఫిక్స్..మరికాసేపట్లో ప్రకటన