PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, దేశ సమగ్రత, అభివృద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
క్రిస్మస్, మహనీయులకు నివాళులు
దేశంలోని క్రైస్తవ సోదరులందరికీ ప్రధాని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 25న భారత రత్న అటల్ బిహారీ వాజపేయి, మదన్ మోహన్ మాలవ్య జయంతి అని గుర్తు చేస్తూ, దేశ నిర్మాణంలో వారి కృషిని కొనియాడారు. ఇదే రోజు మహారాజా బిజిలీ పాసీ జయంతి కూడా కావడం విశేషమని, 2000 సంవత్సరంలో అటల్ జీ ఆయన గౌరవార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేశారని మోదీ గుర్తు చేశారు.
Also Read: విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?
#WATCH | Uttar Pradesh: Prime Minister Narendra Modi says, "The land on which this Prerna Sthal has been built had, for several decades, accumulated heaps of garbage over more than 30 acres. Over the past three years, this has been completely cleared. I also extend my heartfelt… pic.twitter.com/HWdX0M22Tk
— ANI (@ANI) December 25, 2025
చెత్త కుప్ప నుంచి స్ఫూర్తి
ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న కృషిని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో 30 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో చెత్త కుప్పగా ఉన్న ఈ ప్రాంతాన్ని గత మూడేళ్లలో పూర్తిగా శుభ్రం చేసి అద్భుతమైన స్ఫూర్తి కేంద్రంగా మార్చారు. ఈ ప్రాజెక్టు కోసం పనిచేసిన కార్మికులకు, ప్రణాళికాకర్తలకు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బృందానికి ప్రధాని అభినందనలు తెలిపారు.
ఆర్టికల్ 370, జాతీయ సమగ్రత
ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఉండకూడదని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆనాడే చెప్పారని మోదీ గుర్తు చేశారు.జమ్మూ కాశ్మీర్‌లో అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 370 గోడను కూల్చివేసే అవకాశం తమ ప్రభుత్వానికి రావడం బీజేపీకి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రేరణా స్థల్ ప్రాముఖ్యత
ఈ కేంద్రం ఆత్మగౌరవం, ఐక్యత, సేవకు చిహ్నమని ప్రధాని అభివర్ణించారు. అక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయిల భారీ విగ్రహాలు దేశ నిర్మాణానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని చెప్పారు. “వికసిత భారత్” సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
