Modi South Indian Look: సౌతిండియా లుక్ లో మోడీ.. ఫొటో వైరల్

భారత ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో పర్యటిస్తే, ఆయా రాష్ట్రాల కల్చర్ ను ప్రతిబింబించేలా ప్రత్యేక వస్త్రాధారణతో ఆకట్టుకుంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2022 11 19 At 3.10.50 Pm

Whatsapp Image 2022 11 19 At 3.10.50 Pm

భారత ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో పర్యటిస్తే, ఆయా రాష్ట్రాల కల్చర్ ను ప్రతిబింబించేలా ప్రత్యేక వస్త్రాధారణతో ఆకట్టుకుంటున్నారు. పంజాబ్ లో పర్యటిస్తే పంజాబిలా, తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తే అచ్చ తెలుగు వ్యక్తిలా కనిపిస్తూ చర్చనీయాంశమవుతున్నారు. తాజాగా మోడీ మరోసారి సౌతిండియా లుక్ లో కనిపించి అదుర్స్ అనిపించారు. ప్రస్తుతం మోడీ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌లో కాశీ తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సమావేశానికి ప్రధాని హాజరయ్యారు. ఈ సమావేశానికి వచ్చినవారిని ప్రత్యేకంగా పలకరించారు ప్రధాని మోదీ. కాశీలో 30 రోజుల పాటు ద్ర‌విడ సంస్కృతి, సంప్ర‌దాయాల గురించి వివిధ కార్య‌క్ర‌మాలు జరగనున్నాయి.

ఈ సంగమంలో తమిళ విద్యార్థులు, రచయితలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారి వారి విభాగాలతో సంభాషించడానికి, స్థానిక నివాసితులతో సంభాషించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. తమిళ సంగమం సందర్భంగా కాశీ నగరం సంబరాలతో నిండిపోయింది. తమిళనాడు నుంచి కాశీ వచ్చిన వారినిక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా మరియు ‘ఏక్ భారత్ శ్రేష్ట భారత్’ స్ఫూర్తిని నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం ఈ సంగమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి తిరుక్కురల్ మరియు కాశీ-తమిళ సంస్కృతికి సంబంధించిన పుస్తకాలను విడుదల చేశారు. తమిళ విద్యార్థులతో సంభాషించారు.

  Last Updated: 19 Nov 2022, 04:51 PM IST