Modi High-Level Meeting: కరోనా డేంజర్ బెల్స్.. మోడీ హైలెవల్ మీటింగ్!

పలు దేశాల్లో కరోనా (Corona) విరుచుకుపడుతుంటంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ హైలెవల్ మీటింగ్ ఏర్పాటుచేయనున్నారు.

  • Written By:
  • Updated On - December 22, 2022 / 11:55 AM IST

పలు దేశాల్లో మళ్లీ కరోనా (Corona) మహమ్మారి విజృంభిస్తుండటంతో భారత్‌లోనూ ఆందోళన మొదలైంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. దేశంలో కొవిడ్‌ తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ (PM Modi) మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సహా ఇతర ఉన్నతాధికారులు దీనిలో పాల్గొననున్నారు.

ఇండియాలో బీఎఫ్7 (BF.7 Omicron) కేసులతో పాటు కరోనా కేసులు పెరుగుతుండటం, డ్రాగన్ కంట్రీ లో కరోనా విలయ తాండవం చేస్తుండటంతో సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్ అయ్యింది. కోవిడ్-19 పరిస్థితి, సంబంధిత అంశాలను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హై లెవల్ మీటింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. గత ఆరు నెలల్లో భారతదేశం (BF.7 Omicron) సబ్-వేరియంట్ నాలుగు కేసులు నమోదైనట్టు సమాచారం.  అయితే చైనాలో ప్రస్తుత ఇన్ఫెక్షన్ల కారణంగా ఇండియాలో కూడా పెరుగుదలకు దారితీస్తోంది హెల్త్ శాఖ భావిస్తోంది.

ప్రస్తుతం దేశంలో COVIDలో 10 విభిన్న రకాలు ఉన్నాయని, తాజాగా BF.7 ప్రభావం చూపుతోందని తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఉన్న COVID-19 పరిస్థితిని, మహమ్మారి నియంత్రణ, నిర్వహణ కోసం ప్రజారోగ్య వ్యవస్థ సంసిద్ధతను సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఇప్పటికే వైద్యాధికారులతో సమావేశమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, వాక్సిన్ వేసుకోవాలని పలు సూచనలు జారీ చేశారు.  మహమ్మారి ఇంకా ముగియలేదని నొక్కిచెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 (Covid) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు వివరించినట్లు ఆరోగ్య అదనపు ప్రధాన కార్యదర్శి మనోజ్ అగర్వాల్ తెలిపారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతున్న COVID-19 వేరియంట్‌ల ట్రెండ్‌పై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు వివరించింది. అన్ని రాష్ట్రాల్లో మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు జరిగేలా చూసుకోవాలని కోరింది” అని ఆయన చెప్పారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్‌లో కోవిడ్ కేసులు లెక్కకుమించి నమోదవుతున్నాయి. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అటు ప్రజలు, అటు వైద్యాధికారులు మోడీ (PM Modi) హైలెవల్ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని వేచిచూస్తున్నారు.

Also Read: Ajith Tegimpu: సంక్రాంతి బరిలోకి తమిళ్ స్టార్ అజిత్ ‘తెగింపు’