Site icon HashtagU Telugu

PM Modi: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

Modi

Modi

ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.  1947 జులై 22వ తేదీన త్రివర్ణ పతాకాన్ని ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని మోదీ వరుస ట్వీట్లు చేశారు. హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమం త్రివర్ణ పతాకంతో, మనకున్న అనుబంధాన్ని మరింత పెంచుతుందని ప్రధాని అన్నారు. వలస పాలనలో స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాక రెపరెపల కోసం పోరాడిన వారి ధైర్యాన్ని, కృషిని ఈ సందర్భంగా ప్రధాని మోది గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాలను నెరవేర్చేందుకు.. తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించడానికి దారి తీసిన అధికారిక సమాచార వివరాలను సైతం మోదీ ‌ట్విట్టర్‌లో షేర్​ చేశారు.

Exit mobile version