PM Modi Greets: ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. ఐక్యంగా ముందుకు సాగాలని ట్వీట్..!

భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవం వేళ మనం జరుపుకుంటున్నందున ఈ సారి గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. దేశంలోని గొప్ప స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు.

Published By: HashtagU Telugu Desk
karnataka 2023

Bjp Pm Modi

భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవం వేళ మనం జరుపుకుంటున్నందున ఈ సారి గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. దేశంలోని గొప్ప స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. తోటి భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Also Read: Republic Day Greetings: రాష్ట్ర, దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

భారతదేశం నేడు 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్ సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్ డే పరేడ్ దేశం సైనిక పరాక్రమం, సాంస్కృతిక వైవిధ్యం, స్వావలంబన, మహిళా సాధికారత, నూతన భారతదేశం ఆవిర్భావాన్ని ప్రదర్శిస్తుంది. భారతదేశం 15 ఆగష్టు 1947న బ్రిటిష్ వారి నుండి స్వాతంత్య్రం పొందింది. కానీ 26 జనవరి 1950న భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటించబడింది. ఈ రోజున దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

  Last Updated: 26 Jan 2023, 09:17 AM IST