ఉగ్రవాదంపై పోరులో ఇక రాజీ లేదని స్పష్టం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కీలక ప్రకటన చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో త్రివిధ దళాలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ (Complete freedom for the army) ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. “సైన్యం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలా ప్రతిస్పందించాలో వాళ్లే నిర్ణయించుకోగలరు” అనే మాటలతో మోదీ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంతోషం నింపుతుంది. రెండు రోజులుగా ఆయన భద్రతా శాఖ, రక్షణ మంత్రి, ఆయుధ బలగాల అధిపతులతో నిర్వహించిన సమావేశాల దృష్ట్యా, పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర చర్యలకు దిగనున్నదనే ఊహాగానాలు నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది.
DC vs KKR: కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ: ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిదో?
పాకిస్థాన్‌పై ఇప్పటికే భారత్ కొన్ని కీలక చర్యలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాక్ పౌరులకు వీసాలు రద్దు చేయడం, దౌత్య సంబంధాల్ని పరిమితం చేయడం వంటివి కేంద్రం చేపట్టిన మొదటి దశ చర్యలు. కానీ ఇప్పుడు మోదీ ప్రకటనతో మిలిటరీ స్థాయిలో కూడా కౌంటర్ ఆపరేషన్‌కు దారులు వెలుస్తున్నాయన్న స్పష్టత వచ్చింది. ఉగ్రవాదానికి గట్టి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో, సైన్యానికి ‘ఫ్రీ హ్యాండ్’ ఇవ్వడం పాక్‌కు కడుపులో వణుకులు పుట్టించేసింది.
ఉగ్రదాడి విషయానికి వస్తే.. జమ్మూకాశ్మీర్‌లోని బైసరన్ వ్యాలీలో 22న జరిగిన ఉగ్రదాడిలో టూరిస్టులపై జిహాదిస్టులు కాల్పులు జరిపారు. NIA దర్యాప్తు ప్రకారం, ముగ్గురు ఉగ్రవాదులు వ్యాలీకి రెండు ప్రదేశాల నుంచి ప్రవేశించి, హిందూ, ముస్లింలను వేరు చేయాలని ఆదేశించారు. వారు ఎదురుదగిలడంతో 26 మంది నిరాయుధ పర్యాటకులను కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన దేశాన్ని షాక్‌కు గురిచేసింది. మోడీ తాజా ప్రకటనతో, ఇలాంటి ఉగ్రదాడులకు ఇక తీవ్ర ప్రతిస్పందనే జవాబు కావాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారు.