PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానంలో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ప్రధాని మోదీ 2014, 2019లో ఇక్కడి నుంచి చరిత్రాత్మక విజయాలను నమోదు చేశారు. అయితే ప్రతి నామినేషన్ లేదా పుట్టిన రోజు లాంటి ప్రత్యేకమైన రోజున ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్ ని కలుసుకుని ఆశీర్వాదం తీసుకోవడం అలవాటు. నామినేషన్‌కు ముందు ఓ ప్రైవేట్ ఛానెల్‌తో జరిగిన సంభాషణలో తన తల్లిని గుర్తు చేసుకున్నారు మోడీ.
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నా తల్లి చిన్నప్పటి నుంచి నాకు చాలా విషయాలు నేర్పింది. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు లేదా ప్రధానమంత్రి అయిన సమయంలో ఆమె ఆశీర్వాదం నాకు కొండంత బలాన్ని ఇచ్చేది. ఢిల్లీ నుండి గుజరాత్‌లోని ఇంటికి చేరుకున్నప్పుడు అమ్మ పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకునేవాడిని. జీవితంలో నా తల్లి రెండు ముఖ్యమైన విషయాలు మనసులో ఉంచుకోమని సలహా ఇచ్చింది. సిగ్గు పడవద్దు, పేదలను మర్చిపోవద్దు అని అమ్మ అన్నారని ప్రధాని మోదీ అన్నారు. ఇక్కడ గుజరాత్‌లో లంచాన్ని అవమానం అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో లంచం తీసుకోవద్దని, పేదలను మరచిపోవద్దని అమ్మ చెప్పింది. ఆయన చెప్పిన ఈ సలహా నాకు ఇప్పటికీ గుర్తుంది. అని ప్రధాని మోదీ అన్నారు.
నా తల్లికి 100 సంవత్సరాలు నిండినప్పుడు, నేను మరోసారి ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం పొందాను. నా వయసులో ఉన్న ఈ దశలో నన్ను గైడ్ చేయండి అమ్మా అని అన్నాను. అప్పుడు మా అమ్మ మళ్ళీ నాకు రెండు విషయాలు చెప్పింది. తెలివిగా పని చేయండి మరియు స్వచ్ఛతతో జీవితాన్ని గడపండని తన తల్లి చెప్పిన విషయాలను మోడీ గుర్తు చేసుకున్నారు. మా అమ్మ ఇచ్చిన ఈ సలహాలు నాకు పని చేసే శక్తిని ఇస్తాయని, ఈ సలహాలను పాటిస్తూ నేను ముందుకు సాగుతానని ప్రధాని అన్నారు.
Also Read: T20 World Cup: మెగా టోర్నీకి ఏయే దేశాలు తమ జట్లను ప్రకటించాయో తెలుసా..?