Site icon HashtagU Telugu

Longest Railway Tunnel : దేశంలోనే పొడవైన రైలు సొరంగం.. ప్రారంభించిన ప్రధాని మోడీ

Longest Railway Tunnel

Longest Railway Tunnel

Longest Railway Tunnel : దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం ‘T-50’ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు.  ఈ సొరంగాన్ని జమ్మూ-కశ్మీర్‌లోని ఉధంపుర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా  బనిహాల్- ఖడీ- సుంబడ్‌- సంగల్‌దాన్‌ సెక్షన్‌‌లో 48.1 కి.మీ మేర నిర్మించారు. ఈ మార్గంలోనే ఖడీ- సుంబడ్‌ ప్రాంతాల మధ్య ‘టీ-50’ సొరంగం ఉంది. కశ్మీర్‌‌లో తొలిసారిగా ఎలక్ట్రిక్‌ రైళ్లను ప్రవేశపెట్టారు.  బారాముల్లా- శ్రీనగర్‌- సంగల్‌దాన్‌ మార్గంలో రెండు విద్యుత్‌ రైళ్లకు కూడా మోడీ పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమం జమ్మూ నుంచి వర్చువల్‌గా జరిగింది.

We’re now on WhatsApp. Click to Join

సొరంగం విశేషాలు.. 

Also Read :IPL First Match : ఐపీఎల్ సీజన్ ఆరంభ తేదీ ఎప్పుడో తెలుసా ?

  • ఉధంపుర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని రూ.41 వేల కోట్లతో చేపట్టారు. దీని మొత్తం పొడవు 272 కి.మీ.
  • బారాముల్లా- సంగల్‌దాన్‌, ఉధంపుర్‌- కాట్రా సెక్షన్‌ల మధ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
  • కాట్రా- సంగల్‌దాన్‌ల మధ్య 63 కిలోమీటర్ల మేర పనులు సాగుతున్నాయి.
  • ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ‘చీనాబ్‌ వంతెన’, దేశంలో తొలి తీగల రైలు వంతెన ‘అంజీఖాడ్‌’ ఈ మార్గంలోనే ఉన్నాయి.

Also Read : Supreme Court : బీజేపీకి షాక్.. ఆ నగరం మేయర్‌ను మార్చేసిన సుప్రీంకోర్టు