Site icon HashtagU Telugu

PM Modi UPI Payments: యూపీఐ ద్వారా పేమెంట్ చేసిన ప్ర‌ధాని మోదీ..!

PM Modi UPI Payments

Safeimagekit Resized Img (1) 11zon

PM Modi UPI Payments: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో ఉన్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనికి ఒక రోజు ముందు ఫ్రెంచ్ అధ్యక్షుడు గురువారం రాజస్థాన్‌లోని జైపూర్‌కు చేరుకుని అక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్‌ కలిసి రోడ్‌షో కూడా చేశారు. దీని తరువాత వారిద్దరూ హవా మహల్‌కు వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీ కూడా UPI డిజిటల్ ద్వారా చెల్లింపులు (PM Modi UPI Payments) చేశారు.

యూపీఐ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ జైపూర్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు వివరంగా వివరించారు. హవా మహల్ దగ్గర ఫ్రెంచ్ ప్రెసిడెంట్ షాపింగ్ చేసి ఆ త‌ర్వాత టీ తాగారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీ యూపీఐ ద్వారా చెల్లింపులు చేశారు. రామ మందిర నమూనాను మాక్రాన్‌కు బహుమతిగా ఇచ్చారు. రామ మందిరానికి సంబంధించిన విషయాలు కూడా మాక్రాన్‌కు మోదీ చెప్పారు. దీనిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించాలని ఆకాంక్షించిన‌ట్లు తెలుస్తోంది.

హవా మహల్‌ వద్ద మాక్రాన్ ఓ దుకాణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాక్రాన్‌కు అయోధ్య రామమందిర నమూనాను బహూకరించినట్లు తెలుస్తోంది. యూపీఐ ద్వారా దానికి రూ.500 చెల్లించారని సంబంధిత దుకాణదారుడు చెప్పినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. రోడ్‌షో అనంతరం రామ్‌బాగ్‌ ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఇక్కడే ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.

Also Read: IED Destroyed: రిపబ్లిక్ డే రోజున భారీ దాడికి కుట్ర.. భద్రతా సంస్థలు అప్రమత్తం, పుల్వామాలో IED స్వాధీనం..!

ప్రధాని మోదీ ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ మందిరం నమూనా, టీ కోసం ఆన్‌లైన్ చెల్లింపు చేశారు. యూపీఐ ద్వారా ప్రధాని మోదీ టీకి డ‌బ్బులు ఇచ్చారని దుకాణదారుడు చెప్పాడని ప్ర‌ముఖ వార్తా సంస్థ రాసుకొచ్చింది. మోదీ ఆన్‌లైన్ చెల్లింపుల చిత్రం కూడా బయటకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని, ఫ్రెంచ్ అధ్యక్షుడు కలిసి మార్కెట్‌లో తిరుగుతూ కనిపించిన వీడియో కూడా వైర‌ల్ అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.