Site icon HashtagU Telugu

PM Modi: 5 జీ లింకు ద్వారా స్వీడన్ లో కారు నడిపిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్?

Pm Modi

Pm Modi

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా ఢిల్లీలో కూర్చొని యూరప్ కంట్రీ స్వీడన్ లోని కారును నడిపారు. కాగా తాజాగా ప్రవేశపెట్టిన 5జి టెక్నాలజీ సహాయంతో నరేంద్ర మోడీ ఎరిక్సన్ స్టాల్ లో ఈ ఫీట్ని చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ భారత్ ప్రపంచాన్ని నడుపుతోంది అని క్యాప్షన్ ని కూడా రాసుకోచ్చారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5జి టెక్నాలజీ సహాయంతో ఢిల్లీ నుంచి యూరప్ లోని కారును ట్రస్ట్ డ్రైవ్ చేస్తున్నారు అని ఆయన వెల్లడించారు. కాగా యూరప్ లోనే స్వీడన్ లో ఒక ఇండోర్ కోర్స్ లో ఈ వాహనాన్ని ఉంచారు. దానిని నావిగేట్ చేయడం కంట్రోల్ సెటప్ న్యూఢిల్లీలోని ఎరిక్సన్ స్టాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది.

 

ఇక ప్రధాన మోడీ ఆ సీటుపై కూర్చుని ఎదురుగా ఉన్న హ్యాండిల్, ఎక్సలేటర్, బ్రేకులను యూస్ చేస్తూ కార్ డ్రైవ్ చేశారు. పక్కనే ఉన్న కొందరు నరేంద్ర మోడీకి చిన్న అడ్వైస్ లు కూడా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.