PM Modi: తన మంత్రులందరినీ ఎనిమిది గ్రూపులుగా విడగొట్టిన మోదీ

ప్రజలు చర్చించుకునేలా నిర్ణయాలు తీసుకునే మోదీ మరో నూతన నిర్ణయాన్ని తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - November 15, 2021 / 11:28 AM IST

ప్రజలు చర్చించుకునేలా నిర్ణయాలు తీసుకునే మోదీ మరో నూతన నిర్ణయాన్ని తీసుకున్నారు.

మోదీకి ప్రజల్లో క్రేజ్ ఉన్నప్పటికీ తన టీమ్ లోని మంత్రులు ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారనే అపవాదు ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు బీజేపీ కొత్త ప్లాన్ వేసింది.

మోదీ కేబినెట్లోని 77 మంది మంత్రులను ఎనిమిది గ్రూపులుగా విభజించనున్నారు. ఈ విషయాన్ని చర్చించడానికి చింతన్ శివిర్స్ పేరుతో మేధోమధన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులను ఎనిమిది గ్రూపులుగా విభజించి, గంటలపాటు సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశాల్లో మంత్రుల వ్యక్తిగత సామర్థ్యం, శాఖల పనితీరు, పార్టీ సమన్వయం, ప్రజల్లోకి చొచ్చుకుపోగలగడం, క్రెడిబిలిటీ పెంచుకోవడం లాంటి అంశాలపై నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పించినట్లు సమాచారం. ఈ కార్యక్రమం చివరి సెషన్ కి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు.

ఈ ఎనిమిది గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో తొమ్మిది నుంచి పది మంది మంత్రులుంటారు. ఒక్కో గ్రూపుకు ఒక్కో కేంద్ర మంత్రిని గ్రూప్ కోఆర్డినేటర్‌గా నియమించారు. కో ఆర్డినేటర్ కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి పనితీరు, తీసుకోవాల్సిన చర్యలు, మార్పులపై రెస్పాన్స్ తీసుకోని ప్రభుత్వం నిర్వహించే పోర్టల్‌ను అభివృద్ధి చేయడం, సంబంధిత మంత్రులు తీసుకున్న నిర్ణయాలను రివ్యూ చేయడానికి సమావేశాలను ఏర్పాటు చేస్తారు.

ఉద్యోగుల అభిప్రాయాలను, సూచనలను తీసుకుని వాటి అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కనీసం ముగ్గురు సభ్యులతో ఒక యువ నిపుణుల బృందాన్ని అన్ని మంత్రుల కార్యాలయాల్లో మంత్రుల కార్యాలయాల్లో నియమించనున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల అభిప్రాయాలు మరియు అనుభవాలను నిర్వహించే పోర్టల్‌ను కూడా రూపొందించనున్నారు.

ఈ ఎనిమిది గ్రూపులకు కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ లతో పాటు మరో ఇద్దరు కేంద్రమంత్రులు కో ఆర్డినేటర్లుగా ఉంటారు. ఈ ఎనిమిది మంది తమ శాఖకు చెందిన అంశాలపైనే కాకుండా తమ గ్రూపులోని ఇతర మంత్రుల శాఖలపై కూడా చర్చించవచ్చు.

ఈ నూతన విధానంతో
పాలనలో పారదర్శకత ఉండడంతో పాటు, ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశముంటుందని కేంద్రం భావిస్తోంది.