PM Modi Condoles: ఏపీ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోదీ

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Modi (1) (1)

Modi (1) (1)

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు కేంద్రం తరపున రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు.

Also Read: Rahul Gandhi: పెళ్లిపై స్పందించిన రాహుల్ గాంధీ.. అలాంటి అమ్మాయి అయితే ఓకే..!

ఏపీలోని నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో జరిగిన దుర్ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబీకులకు రూ. 2 లక్షల చొప్పున పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తామని PMO తెలిపింది. మరోవైపు.. ఈ ఘటనపై చంద్రబాబు విచారం వ్యక్తం చేసి వెంటనే సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అధిష్టానం రూ.10 లక్షలు ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని టీడీపీ నేతలను చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే.

  Last Updated: 29 Dec 2022, 09:55 AM IST