Modi – Video Games : వీడియో గేమ్ ఆడిన మోడీ.. టాప్ గేమర్స్‌తో చిట్ చాట్ విశేషాలివీ

Modi - Video Games : ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏది చేసినా.. చాలా స్పెషలే! 

  • Written By:
  • Updated On - April 13, 2024 / 10:49 AM IST

Modi – Video Games : ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏది చేసినా.. చాలా స్పెషలే!  తాజాగా దేశంలోని టాప్‌ గేమర్స్​తో ఢిల్లీలోని తన నివాసంలో మోడీ సరదాగా చిట్ చాట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇవాళ (ఏప్రిల్ 13న) ఉదయం 9:30 గంటలకు విడుదల చేశారు. ప్రధానమంత్రి అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లో దీన్ని రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రకారం.. గేమింగ్ రంగంలో యువతకు ఉండే అవకాశాలు, యువత ఆకాంక్షల గురించి ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు వారితో కలిసి వీడియో గేమ్స్ కూడా ఆడారు. ఈసందర్భంగా ప్రధానికి  ‘నమో ఓపీ’ అనే గేమింగ్ ట్యాగ్​ను కూడా ఇచ్చారు. ప్రధాని మోడీతో మాట్లాడుతుంటే.. తన ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడినట్టుగా అనిపించిందని ఓ గేమర్ చెప్పుకొచ్చారు. మన దేశంలో అతిపెద్ద  ఇన్ ఫ్లూయెన్సర్ ప్రధాని మోడీయే అని ఇంకో గేమర్ కామెంట్ చేశాడు. ప్రధాని మోడీని కలిసిన గేమర్లలో నమన్ మాథుర్ (సోల్ మోర్టల్), అనిమేశ్ అగర్వాల్ (8బిట్‌థగ్),  పాయల్ టరే (పాయల్ గేమింగ్),  మిథిలేశ్ పాటంకర్ (మిత్‌పాట్), గణేశ్ గంగాధర్ (స్క్‌రోస్సీ), తీర్థ్ మెహతా, అన్షు బిష్ఠ్​ ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join

డిజిటల్ విప్లవంతో మన దేశంలో గేమింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ఈ తరుణంలో భారతదేశంలో గేమర్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రధాని మోడీ ప్రశ్నించారు. గేమింగ్ పరిశ్రమకు సంబంధించిన అపోహల గురించి కూడా పీఎం మాట్లాడారు. నైపుణ్యం ఆధారిత గేమ్‌లు, వెంటనే ఆదాయాన్ని సంపాదించి పెట్టే గేమ్‌లను మధ్య ఉన్న తేడా గురించి ప్రధాని మోడీ గేమర్లను అడిగి  తెలుసు కున్నారు. వీడియో గేమ్‌లకు(Modi – Video Games) అడిక్ట్ అయ్యే సమస్యపై ఈసందర్భంగా గేమర్లు, ప్రధానమంత్రి మధ్య చర్చ జరిగింది. ఈసందర్భంగా ప్రధాని మోడీ VR, PC, కన్సోల్‌లను ధరించి వీడియో గేమ్స్ ఆడారు. ప్రధాని మోడీ మొదటిసారి గేమ్ ఆడటాన్ని చూసి గేమర్‌లు ఆశ్చర్యపోయారు.

Also Read :Hyderabad Lok Sabha : ‘మజ్లిస్‌’ కంచుకోటలో కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ

కాగా, ఆన్‌లైన్ గేమింగ్ కోసం నిబంధనలను రూపొందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు అప్పగించింది.ఈ-స్పోర్ట్స్‌పై యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ నిఘా ఉంచుతుంది. నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్‌ కోసం అనేక మంది డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను ఇటీవల ఎంపిక చేశారు. వారికి స్వయంగా ప్రధాని మోడీ అవార్డులు ఇచ్చి సత్కరించారు.ఇలా సత్కారం అందుకున్న వారిలో 20 ఏళ్ల జాన్వీ సింగ్, 23 ఏళ్ల మైథిలీ ఠాకూర్, 28 ఏళ్ల జయ కిషోరి, 28 ఏళ్ల నిశ్చయ్ మల్హన్, 30 ఏళ్ల రణవీర్ అలహబాడియా సహా అనేక మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు.

Also Read :Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు మెసేజ్‌లతో రాయబారం.. హైదరాబాద్‌కు రప్పిస్తుందా ?