Site icon HashtagU Telugu

PM Modi Meeting: రెమాల్ తుఫాను ప్రభావంపై ప్రధాని మోదీ సమీక్ష

PM Modi Meeting

PM Modi Meeting

PM Modi Meeting: లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఎన్డీయే ఆధిక్యం సాధించడంతో బీజేపీ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. మరోవైపు ప్రధాని మోదీ పాలనపై దృష్టి పెట్టారు. ఆదివారం ఢిల్లీలో అధికారులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో తుపాను పరిస్థితిని సమీక్షించారు. గత ఆదివారం బంగాళాఖాతం నుంచి ఉద్భవించిన రమాల్ తుఫాను ఈశాన్య రాష్ట్రాల్లో భారీ విధ్వంసం సృష్టించింన విషయం తెలిసిందే.

రమాల్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. దీని కారణంగా అనేకమంది మరణించారు. రెండు లక్షల మందికి పైగా దీని బారిన పడ్డారు.ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని మోడీ కూడా వివిధ అంశాలపై మరికొన్ని సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇందులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి 100 రోజుల ఎజెండాను సమీక్షించేందుకు మేధోమథనం చేయనున్నారు. దీనితో పాటు ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను కూడా ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. రమాల్ తుఫాను తరువాత ప్రకృతి వైపరీత్యాల మధ్య ఈశాన్య రాష్ట్రాల పరిస్థితిపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. అలాగే బాధిత ప్రజలకు అన్ని విధాలా ఆదుకోవాలని హామీ ఇచ్చారు. కేంద్రం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, బాధిత ప్రజలను ఆదుకునేందుకు అధికారులు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు.

పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, డీజీ ఎన్‌డిఆర్‌ఎఫ్ మరియు మెంబర్ సెక్రటరీ, ఎన్‌డిఎంఎతో పాటు పిఎంఓ మరియు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Also Read: Zomato: మధ్యాహ్నం సమయంలో ఆర్డర్ చేయడం మానుకోండి: జొమాటో