PM Modi: జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు.. దేశానికి సైన్యం సురక్షా కవచం

దేశానికి సైన్యం సురక్షా కవచమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

  • Written By:
  • Publish Date - November 4, 2021 / 01:40 PM IST

శ్రీనగర్‌ : దేశానికి సైన్యం సురక్షా కవచమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో గురువారం ప్రధాని దీపావళి వేడుకలను జవాన్లతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ప్రధాని నివాళులర్పించారు.

అనంతరం సైనికులనుద్దేశించి మాట్లాడారు. ‘సైన్యం ధైర్యసాహసాలు దీపావళికి మరింత శోభను తీసుకొచ్చాయి.. ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశకోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు.. సర్జికల్ స్ట్రయిక్స్‌లో సైన్యం పాత్ర కీలకం.. సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుతున్నాం.. 200కిపైగా అత్యాధునిక ఆయుధాలను తయారుచేసుకుంటున్నాం’ అని మోదీ అన్నారు.

‘అన్ని రంగాల్లోనూ మహిళలకు అవకాశం కల్పిస్తున్నాం.. ఇప్పటికే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలు రాణిస్తున్నారు.. సైన్యంలోనూ వారికి ప్రాధాన్యతనిస్తున్నాం.. సైనిక పాఠశాలల్లోనూ బాలికలకు ప్రవేశం కల్పిస్తున్నాం.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, కాలేజీల్లోనూ వారికి సీట్లను కేటాయిస్తున్నాం’ అని మోదీ అన్నారు. ప్రధాని మోదీ ఆర్మీ దుస్తులు ధరించి, తలపై టోపి పెట్టుకొని ఆర్మీ శిబిరాలను సందర్శించారు.

ఆ తర్వాత జవాన్లకు ప్రధాని స్వీట్లు తినిపించారు.