Site icon HashtagU Telugu

PM Modi Bronze Statue : మోడీ ఫై ఎంత అభిమానం..రూ.200 కోట్లతో విగ్రహం..!!

Pm Modi Bronze Statue In As

Pm Modi Bronze Statue In As

అభిమానానికి హద్దులు అనేవి ఉండవు..ఒక్కసారి గుండెల్లో అభిమానం పెట్టుకున్నారో..వారి కోసం ఏమైనా చేయడానికి..ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడరు. మాములుగా సినీ తారల మీద చాలామంది అభిమానం అనేది పెంచుకుంటారు. వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అనేలా ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతున్న..మరి ఏ సందర్భం అయినాసరే తమ అభిమానాన్ని చాటుకుంటూ వస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల రాజకీయ నేతలపై కూడా అలాంటి అభిమానమే పెంచుకుంటున్నారు. కేవలం అభిమానం అంటే గుండెల్లోనే కాదు కళ్లముందు అందరికి కనపడేలా చేస్తున్నారు. తమ అభిమాన నేత కోసం విగ్రహాలు ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. తాజాగా ప్రధాని మోడీ (PM Modi) ఫై అలాంటి అభిమానమే పెంచుకున్నారు అసోంకి చెందిన వ్యాపారవేత్త నవీన్‌చంద్ర బోరా.

మోడీ ఫై అభిమానం తో 190 అడుగుల ఎత్తైన ప్రధాని క్యాంస్య విగ్రహాన్ని (Bronze Statue) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సోమవారమే ఆ వ్యాపారవేత్త భూమి పూజ మొదలుపెట్టారు. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.200 కోట్లు ఖర్చుచేయనున్నారు. గువాహటి నగరానికి సమీపంలో ఉన్న తన స్థలంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ఆ వ్యాపారి… శంకుస్థాపన కార్యక్రమాన్ని మూడు రోజులపాటు నిర్వహించడం విశేషం. పీఠభాగంతో కలుపుకొని విగ్రహం ఎత్తు 250 అడుగులు ఉంటుందని నవీన్‌చంద్ర చెప్పుకొచ్చారు. విగ్రహం మెడ భాగంలో అసోం సంస్కృతికి చిహ్నంగా గమోసా (అసోం ప్రజలు ధరించే ఖద్దరు వస్తం) ఉంటుందని ఆయన వివరించారు. విగ్రహ ప్రతిష్ఠాపన వివరాలతో గతేడాది ప్రధాని  కార్యాలయానికి లేఖ కూడా పంపినట్లు తెలిపారు.

Read Also : Flights Delayed: ఢిల్లీ విమానాశ్రయంలో 50కి పైగా విమానాలకు అంతరాయం.. కార‌ణ‌మిదే..?