Site icon HashtagU Telugu

PM Modi – Diwali : చైనా బార్డర్‌లో ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోడీ.. దీపావళికి రెడీ

Diwali Pm Modi

Diwali Pm Modi

PM Modi – Diwali : ప్రధానమంత్రి నరేంద్రమోడీ హిమాచల్‌ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్నారు. లెప్చాలో ఉన్న భారత ఆర్మీ యూనిట్‌‌ వద్దకు చేరుకున్న ప్రధాని.. ఆర్మీ యూనిఫామ్ ధరించారు. అనంతరం అక్కడ విధుల్లో ఉన్న ఆర్మీ సిబ్బందిని కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ దీపావళి కావడంతో.. సైనికులతో కలిసి వేడుకలను నిర్వహించుకునేందుకే ఆదివారం ఉదయాన్నే లెప్చాకు ప్రధాని వచ్చారు. లెప్చా ఆర్మీ యూనిట్ చైనా బార్డర్‌లో ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్‌లో ప్రధాని పోస్ట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతకుముందు రోజు ప్రధాని మోడీ తన దీపావళి సందేశంలో.. దేశంలోని ప్రజలకు అద్భుతమైన ఆయురారోగ్యాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, అద్భుతమైన ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నానని ప్రధాని పేర్కొన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచే ఏటా దీపావళి పండుగను సైనికుల మధ్య నిర్వహించుకునే సంప్రదాయాన్ని మోడీ మొదలుపెట్టారు. దేశం కోసం త్యాగాలు చేస్తున్న సైనికులకు కృతజ్ఞతగా ప్రధాని మోడీ ఏటా ఒక  సరిహద్దు సైనిక స్థావరానికి వెళ్లి, సైనికులతో కలిసి పండుగను(PM Modi – Diwali) నిర్వహించుకుంటున్నారు.