PM Announces 2 lakh Ex-Gratia: లక్నో ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో భవనం కూలిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సంతాపం వ్యక్తం చేశారు. దీంతో పాటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
లక్నో ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో సంతాపం తెలిపారు. భవనం కూలిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు రాష్ట్రపతి. లక్నో ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా స్పందిస్తూ.. లక్నోలో భవనం ప్రమాదంలో ప్రజలు మరణించడం విచారకరం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని మోడీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించిన ఆయన, మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా((2 lakh Ex-Gratia) అందజేస్తామని ప్రకటించారు. అదే సమయంలో క్షతగాత్రులకు రూ.50,000 సాయం అందిస్తానని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది, ఇందులో ఇప్పటివరకు 8 మంది మరణించారు. ఈ భవనాన్ని నాలుగేళ్ల క్రితం నిర్మించినట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం 4:45 గంటలకు భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో కింది అంతస్తులో పని చేస్తున్నారు.రెస్క్యూ ఆపరేషన్‌లో రాజ్‌కిషోర్ (27), రుద్ర యాదవ్ (24), జగ్రూప్ సింగ్ (35) అనే ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను ఎస్‌డిఆర్‌ఎఫ్ స్వాధీనం చేసుకున్నట్లు రిలీఫ్ కమిషనర్ జిఎస్ నవీన్ ఆదివారం తెలిపారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో జస్ప్రీత్ సింగ్ సాహ్ని, ధీరజ్ గుప్తా, పంకజ్ తివారీ, అరుణ్ సోంకర్, రాకేష్ లఖన్ పాల్, రాజ్ కిషోర్, రుద్ర యాదవ్ మరియు జగ్రూప్ సింగ్ ఉన్నారు.