Site icon HashtagU Telugu

Modi- Amit shah: యాక్ష‌న్‌లోకి అమిత్ షా, న‌డ్డా.. ఆరోజే ఫుల్ క్లారిటీ వ‌చ్చేస్తోందా?

Modi And Amit Shah

కేంద్రంలో బీజేపీ (BJP) మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ (Congress) స‌హా, బీజేపీయేత‌ర పార్టీల‌న్ని బీజేపీని గ‌ద్దెదించేందుకు సిద్ధ‌మ‌వుతున్న వేళ మోదీ (Modi), అమిత్ షా (Amit shah) ద్వ‌యం స‌రికొత్త వ్యూహంతో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ (Lok Sabha Elections) కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో ఎన్టీయేను విస్త‌రించేలా అమిత్ షా, జేపీ న‌డ్డాలు ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. బుధ‌వారం అర్థ‌రాత్రి జ‌రిగిన బీజేపీ ముఖ్య‌నేత‌ల స‌మావేశంలో మోదీ ఈ విష‌యంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన‌ట్లు తెలిసింది. దీంతో బ‌ల‌హీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల‌ను క‌లుపుకొని పోవాల‌ని బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం నిర్ణ‌యం తీసుకుంది.

ఇప్ప‌టికే కొన్ని పార్టీల అధినేత‌ల‌తో అమిత్ షా, న‌డ్డాలు భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుతో ఇటీవ‌ల షా, న‌డ్డాలు విడివిడిగా స‌మావేశమ‌య్యారు. దీంతో 2014 త‌ర‌హాలో టీడీపీ, బీజేపీ మ‌రోసారి పొత్తుతో ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, కొద్దిరోజులకు అదేంలేద‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది. తాజాగా మ‌రోసారి బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఎన్టీయేను విస్త‌రించేందుకు నిర్ణ‌యం తీసుకోవ‌టంతో తెలుగు రాష్ట్రాల్లో మ‌రోసారి బీజేపీ, టీడీపీ పొత్తు ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఎన్టీయే విస్త‌ర‌ణ‌లో భాగంగా ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకుంటే తెలంగాణ‌లోనూ టీడీపీతో బీజేపీ క‌లిసివెళ్లే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ‌లో టీడీపీ బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. ఈ నిర్ణ‌యం బీజేపీ లాభిస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే, ఈ విష‌యంపై సోమ‌వారం ఫుల్ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ కేబినెట్‌లో ఏపీ నుంచి ఒక‌రిని, తెలంగాణ నుంచి ఒక బీజేపీ ఎంపీని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. కేబినెట్ లో మార్పులు చేర్పుల త‌రువాత ఎన్డీయేను విస్త‌రించే విష‌యంపై అమిత్ షా, జేపీ న‌డ్డాలు దృష్టిసారిస్తార‌ని పలువురు బీజేపీ నేత‌లు పేర్కొంటున్నారు.

Minister KTR Serious : సొంత పార్టీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన మంత్రి కేటీఆర్‌.. ఈసారి అత‌న్ని ప‌క్క‌న పెట్టిన‌ట్లేనా?